బాలకృష్ణను 'సీఎం' చేసారంటూ కృష్ణంరాజు
ఎవరెవరో..సీఎంలు కాగా లేనిది.. ఈ పండుగరోజున బాలకృష్ణను మీరు సీఎం చేసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది అన్నారు కృష్ణం రాజు. శ్రీరామరాజ్యం 50 రోజుల పంక్షన్ లో ప్రముఖ నటుడు కృష్ణం రాజు మాట్లాడుతూ ఇలా స్పందించారు. ఆయన మాట్లాడుతూ...ఈ పండగ రోజున ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్నాను..అది...అని ఆయన ఏదో చెప్పబోతూంటే....అభిమానులు..బాలయ్య సీఎం అని అరిచారు. దానికి కృష్ణ రాజు నవ్వి...ఎవరెవరో.. సీఎంలు కాగా లేనిది.. ఈ పండుగరోజున బాలకృష్ణను మీరు సీఎం చేసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది అన్నారు నవ్వుతూ..దానికి బాలకృష్ణ కూడా చిరు మందహాసం చేసారు.
ఇక సినిమా గురించి మాట్లాడుతూ...నేను సినిమా చూసినప్పుడు ఆశ్చర్యపోయాను..మొదటి ఆ సాంగ్..మా బాలయ్య కనిపించినప్పుడు...అరే రామారావు గారినే వేసేసారు ..అలాగ ఆ సాంగ్ అయ్యేవరకూ..పట్టాభిషేకం అయ్యేవరకూ..చూస్తూంటే మా బాలయ్య శ్రీరామ చంద్రుడు ఎన్టీరామారావు గారు కనిపంచారు.అది బాపు గొప్పతనం..పాట జొన్నవిత్తుల గారి పాట..ఇళయరాజాగారి గొప్పతనం..ఇంత మంచి సినిమా..ఇంతగొప్ప సినిమా తీసారు..అనిమెచ్చుకున్నారు. అంతేగాదు..తమ్ముడు..శ్రీకాంత్..రాముడుకి తమ్ముడుగా చేసాడు. ఇక రాముడు భక్తుడు హనుమంతుడు..హనుమంతులు లాంటి భక్తులు మీరు అంటూ అభిమానులని ఉద్దేశించి ఆయన అన్నారు. ఇక తను బాపుతో చేసిన సినిమాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమానికి దాసరి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో ఇళయరాజా, నయనతార, కె.విశ్వనాథ్, యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, శ్రీకాంత్, రామానాయుడు, రాఘవేంద్రరావు, ఏడిద నాగేశ్వరరావు, జొన్నవిత్తుల, మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











