ఆ వార్తలను ఖండించిన కృష్ణంరాజు.. సమాధానం చెప్పటం చాలా కష్టమవుతుందంటూ సీరియస్

సోషల్ మీడియా హవా పెరిగిన ఈ కాలంలో ఏది నిజమో ఏది అబద్దమే తెలుసుకోలేకపోతున్నారు సామాన్య జనాలు. ప్రత్యేకంగా సెలెబ్రిటీల గురించి వచ్చే వార్తలను.. ఒక్క క్షణం ఆగి ఆలోచించుకోకుండానే ప్రచురించేస్తున్నారు. దీంతో అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. తాజాగా సీనియర్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే వార్తలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

 న్యుమోనియా వ్యాధితో..

న్యుమోనియా వ్యాధితో..

గత కొంతకాలంగా కృష్ణంరాజు న్యుమోనియా వ్యాధితో బాధపడుతున్నారు కృష్ణం రాజు. బుధవారం రోజు రాత్రి సమయంలో శ్వాసకోశ సమస్య తీవ్రం కావడంతో ఆస్పత్రికి తరలించడం జరిగింది. అయితే ఇది రెగ్యులర్ చెకప్ కోసమేనని తెలుసుకోకుండా సీరియస్‌గా ఉందంటూ వార్తలను వ్యాపింపజేశారని సీరియస్ అయ్యారు.

ఆందోళనలో ఫ్యాన్స్

ఆందోళనలో ఫ్యాన్స్

ఉదయాన్నే రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితిపై వార్తలు వస్తుండటం చూసి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రభాస్,కృష్ణంరాజు అభిమానులు ప్రార్థించారు. అయితే కృష్ణంరాజు ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ, ఆయన ఆరోగ్యం పరిస్థితిపై ఓ ప్రకటనను విడుదల చేశారు.

విషయ సేకరణ, నిర్ధారణ కూడా లేకుండా..

విషయ సేకరణ, నిర్ధారణ కూడా లేకుండా..

‘కేవలం న్యూమోనియా కు చికిత్స చేయించుకోవడంతో పాటు రెగ్యులర్ గా చేయించుకునే ఆరోగ్య పరీక్షల నిమిత్తం కేర్ హాస్పిటల్ కు వెళ్ళటం చూసిన కొన్ని పత్రికల వారు కనీస విషయ సేకరణ, నిర్ధారణ కూడా లేకుండా వార్తలు రాశారు. ఇందువల్ల హాస్పిటల్లో చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.

 పరామర్శలకు సమాధానం చెప్పటం చాలా కష్టమవుతుంది

పరామర్శలకు సమాధానం చెప్పటం చాలా కష్టమవుతుంది

ఇలాంటి సందర్భాల్లో ఆందోళనకు గురయ్యే అభిమానుల పరామర్శలకు సమాధానం చెప్పటం చాలా కష్టమవుతుంది. ప్రస్తుతం నా ఆరోగ్యం చాలా బాగుంది. చెకప్స్ పూర్తయిన వెంటనే ఇంటికి వెళ్ళి పోతాను. నా ఆరోగ్యం విషయంగా ఆందోళన వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.. 'అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X