సాహో తర్వాతే పెళ్లి.. పెదనాన్న కోసం ప్రభాస్ ఏం చేస్తున్నాడంటే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి మీడియాలో ఎన్ని వార్తలు వస్తున్నా అవన్నీ పుకార్లే అని ఎప్పటికప్పుడు తేలిపోతోంది. మీడియా నుంచి ఈ ప్రశ్న ఎదురైనప్పుడలా ప్రభాస్ తప్పించుకుంటున్నాడు. ప్రభాస్ పెళ్లి విషయంలో అతడి పెదనాన్న కూడా మీడియా ప్రశ్నలతో విసిగిపోతున్నాడు. ఇటీవల కృష్ణంరాజు తన 79వ పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం!

సాహో తర్వాత

సాహో తర్వాత

సాహో చిత్రం పూర్తి కాగానే ప్రభాస్ పెళ్లి తప్పకుండా ఉంటుందని కృష్ణంరాజు తేల్చేశారు. మరి కొన్ని నెలలు ఓపిక పడితే ప్రభాస్ పెళ్లికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుస్తాయని కృష్ణంరాజు తెలిపారు. చూస్తుంటే సాహో తర్వాత ప్రభాస్ కు ఖచ్చితంగా పెళ్లి చేయాలని కుటంబ సభ్యులు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. పెళ్లి మాటెత్తితే ప్రభాస్ తప్పించుకుంటున్నాడని కృష్ణం రాజు గతంలో కామెంట్ చేశారు.

ఎన్నో రూమర్స్

ఎన్నో రూమర్స్

ప్రభాస్ సరసన బాహుబలి, బిల్లా, మిర్చి చిత్రాల్లో అనుష్క నటించింది. అన్ని చిత్రాల్లో వీరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. వీరిద్దరి మధ్య ఎఫైర్ సాగుతోందంటూ ఎన్నో రూమర్స్ వినిపించాయి. ఈ రూమర్స్‌లో ఎలాంటి వాస్తవం లేదని ప్రభాస్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తేల్చి చెప్పేశాడు. అనుష్క తనకు మంచి స్నేహితురాలని తెలిపాడు. దీనితో అన్ని రూమర్స్ కు చెక్ పెట్టినట్లు అయింది.

యూవీ క్రియేషన్స్ సంస్థ

యూవీ క్రియేషన్స్ సంస్థ

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ దర్శత్వంలో సాహో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ హై వోల్టేజ్ యాక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రభాస్ కు సన్నితులైన యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ 20వ చిత్రాన్ని కూడా యూవీ క్రియేషన్సే నిర్మిస్తోంది.

పెదనాన్న కోసం

పెదనాన్న కోసం

కృష్ణంరాజుకు చెందిన నిర్మాణ సంస్థ గోపికృష్ణ బ్యానర్‌లో ప్రభాస్ బిల్లా చిత్రంలో నటించాడు. ఆ తర్వాత కృష్ణంరాజు నిర్మాణంలో ప్రభాస్ నటించలేదు. ప్రభాస్ తో 'భక్త కన్నప్ప' చిత్రానికి సీక్వెల్ చేయాలనేది కృషంరాజు కల. అదేవిధంగా ప్రభాస్ తో 'ఒక్క అడుగు' అనే చిత్రాన్ని నిర్మిచాలని కూడా కృష్ణంరాజు ప్లాన్ చేసుకున్నారు. కానీ ప్రభాస్ ఎప్పటికప్పుడు బిజీగా మారుతుండడంతో తన పెదనాన్న నిర్మాణంలో సినిమా చేసే అవాకాశం లేకుండా పోతోంది. దీనితో తాజాగా ప్రభాస్ ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

నిర్మాణ భాగస్వామిగా

నిర్మాణ భాగస్వామిగా

రాధాకృష్ణ దర్శత్వంలో రూపొందబోయే చిత్రంలో తన పెదనాన్నని కూడా ప్రభాస్ నిర్మాణ భాగస్వామిగా చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కృష్ణంరాజు తన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో ధృవీకరించారు. తన సమర్పణలో ఆ చిత్రం ఉంటుందని తెలిపారు. అంటే కృష్ణంరాజు సమర్పకుడిగా వ్యవహరిస్తూ ఈ చిత్రంలో వాటా పొందనునట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే, ప్రభాస్ జంటగా నటిస్తున్నా ఈ చిత్రాన్ని దర్శకుడు 1960 నేపథ్యంలోని ప్రేమ కథగా తెరకెక్కించనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X