»   »  ప్రభాస్ పెళ్లి ఇష్యూ: ఆగ్రహానికి గురైన కృష్ణం రాజు!

ప్రభాస్ పెళ్లి ఇష్యూ: ఆగ్రహానికి గురైన కృష్ణం రాజు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రభాస్ వివాహం భీమవరంకు చెందిన అమ్మాయితో జరుగబోతోంది అంటూ గత కొంత కాలంగా రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని టీవీ ఛానల్స్ వారు సదరు అమ్మాయి ఫోటోగ్రాఫును కూడా టెలికాస్ట్ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు ఫైర్ అయ్యాడు.

‘ప్రభాస్ పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ ఆదారం లేని వార్తలు. ఇలాంటి రూమర్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారో నాకు తెలియదు. ఇలాంటి రూమర్స్ రావడం ఇదే మొదటి సారి కాదు..గతంలోనూ ఇలాంటివి విన్నాను' అని కృష్ణం రాజు అన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ పెళ్లి గురించి ఏదైనా ఉంటే స్వయంగా నేనే మీడియాకు వెల్లడిస్తాను అన్నారు.

కృష్ణం రాజు స్వయంగా స్పందించడంతో ప్రభాస్ ఇప్పుడు పెళ్లి ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ ‘బాహుబలి-2' షూటింగుకు రెడీ అవుతున్నారు. ఇందుకోసం పాత్రకు తగినట్లుగా శరీరాకృతిని పెంచడంతో పాటు....హెయిర్ స్టైల్, గడ్డంకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

Krishnam Raju fire on Prabhas marriage rumours

‘బాహుబలి-ది కంక్లూజన్' షూటింగ్ విషయాల్లోకి వెళితే.... ప్రస్తుతం రాజమౌళి అండ్ టీం ప్రీ ప్రొడక్షన్ పనుల మీద బిజీగా గడుపుతున్నారు. డిసెంబర్ 14 నుండి షూటింగ్ మొదలు కానుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగుకు సంబంధించిన సెట్టింగ్స్ రెడీ అవుతున్నాయి.

బాహుబలి పార్ట్ 1 విజయం అందించిన ఉత్సాహంతో రాజమౌళి అండ్ టీం సెకండ్ పార్ట్ ను మరింత అద్భుతంగా తీయాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. సెకండ్ పార్ట్ ప్రేక్షకుల ఊహకు అందని విధంగా ఉంటుందని, గతంలో ఇండియన్ సినిమా చరిత్రలో ఎన్నడూ చూడని అనుభూతి ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు పొందుతారని అంటున్నారు.

English summary
Krishnam Raju fire on Prabhas marriage rumours. "These are baseless rumours. I don't know who is spreading them. It is not the first time that these kind of rumours are doing the rounds", said Krishnam Raju.
Please Wait while comments are loading...