తీసుకోరా అంటే వద్దన్నాడు: రెబల్ స్టార్ కంటతడి, హరికృష్ణ ఫ్యామిలీకి వెంకీ, వినాయక్ పరామర్శ

By Bojja Kumar

రోడ్డు ప్రమాదంలో మరణించిన ప్రముఖ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ మరణంతో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆయన చివరి చూపు కోసం పలువురు ప్రముఖులు మెహదీపట్నంలోని నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. టాలీవుడ్ స్టార్స్ కృష్ణం రాజు, వెంకటేష్, ఆర్ నారాయణ మూర్తి, దర్శకుడు వివి వినాయక్ హరికృష్ణ నివాసానికి చేరుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కృష్ణ రాజు తన తమ్ముడిలాంటి హరికృష్ణను కోల్పోవడం బాధగా ఉందంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.

వెంకటేష్

వెంకటేష్

హరికృష్ణగారి మరణం బాధాకరం. ఆయన అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. నాకు చాలా ఆత్మీయుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆయన ఫ్యామిలీకి ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను అని వెంకటేష్ అన్నారు.

వివి వినాయక్

వివి వినాయక్

ఈ రోజు చాలా బ్యాడ్ డే. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కాదు. ఆయన ఫ్యామిలీతో అనుబంధం ఉన్న వారందరికీ బ్యాడ్ డే. ఆయన చిన్న వారితో చిన్నగా ఉండేవారు, పెద్దవారితో పెద్దగా ఉండేవారు. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనిషి. అలాంటి వ్యక్తి మరణించడం చాలా బాధగా ఉంది. తారక్, కళ్యాణ్ రామ్, వారి ఫ్యామిలీ అందరికీ దేవుడు దైర్యాన్ని ఇవ్వాలి. హరికృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్తిగా రోరుకుంటున్నాను.... అని వివి వినాయక్ అన్నారు.

ఆర్ నారాయణ మూర్తి

ఆర్ నారాయణ మూర్తి

ఎన్టీఆర్ గారు సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత ఆయనకు రథ సారథి ఆయన కుమారుడు హరికృష్ణ గారు, ఇపుడు అదే హరికృష్ణ గారు అదే రథాన్ని తోలుకుంటూ వెళుతూ మరణించడం బాధగా ఉంది. ఆయన మరణం అందరికీ తీరని లోటు. ఆయనలోని గొపపదనం .... ఆయనలోని మానవీయ విలువలు. కుటుంబ విలువులు, సామాజిక విలువల మీద నిబద్దత, పట్టు ఉన్న వ్యక్తి. ఆప్యాయత అనురాగాలు పంచే మంచి మనసున్న వ్యక్తి. సీతయ్య ఎవరి మాట వినడు... ఆయన అటు వంటి మనిషే.. కానీ అది మంచి కోసమే. అలాంటి వ్యక్తి మరణించడం మనందరికీ తీరని లోటు. హరికృష్ణగారి ఆత్మకు శాంతి చేకూరాలి... అని ఆర్ నారాయణ మూర్తి అన్నారు.

కృష్ణం రాజు...

కృష్ణం రాజు...

హరికృష్ణ గురించి మాట్లాడటానికి మాటలు రావడం లేదు. నన్ను అన్నయ్యా అని ఆప్యాయంగా పిలిచేవాడు. ఈ రోజు ఇలా జరుగడం చెప్పలేనంత బాధగా ఉంది. కొడుకు పోయినపుడు దేవుడు ఇంత అన్యాయం చేశాడు అన్నాడు.. ఇపుడు నీక్కూడా దేవుడు అన్యాయం చేశాడురా... హరికృష్ణ నా సొంత తమ్ముడు లాంటోడు. ఓ రోజు నా కార్లో టేప్ రికార్డర్ చూసి ఎంత బావుందో అన్నయ్యా అన్నాడు. తీసుకోరా అని నేను అంటే... నేను సంపాదించిన తర్వాత కొనుక్కుంటాను అన్నయ్యా... ఒకరిది నేను తీసుకోను అన్నాడు. మీ నాన్నగారిది అయినా ఇలానే అంటావా అంటే... అంతే అన్నయ్య అన్నాడు. నేను నా సొంతంగా సంపాదించాలి, సొంతంగా బ్రతకాలి అనే నిజాయితీ పరుడు. ఎవరైనా సంతోషపడుతుంటే చూసి ఆనందపడేవాడు. పది మందికి ఉపకారం చేయాలనుకునేవాడు... అంటూ కృష్ణం రాజు కన్నీటి పర్యంతం అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X