ప్రభాస్ పెళ్లి గురించి కృష్ణంరాజు ఆశ్చర్యకర సమాధానం..!
Recommended Video

ప్రభాస్ ఇండియాలో మోస్ట్ ఎలిజబుల్ బాచులర్స్ లో ఒకడు. అందులో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి చిత్రంతో ప్రభాస్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పెళ్లి గురించి కూడా అభిమానుల్లో చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ప్రభాస్ పెళ్లి విషయం గురించి అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిలో ఎలాంటి వాస్తవం లేదని తేలిపోయిది. తాజగా ఓ ఇంటర్వ్యూలో కృష్ణం రాజు పెళ్లి గురించి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.

ఎప్పుడు అడిగినా అదే సమాధానం
ప్రభాస్ ని పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా త్వరలో చేసుకుంటా అనే సమాధానం వచ్చేదని కృష్ణం రాజు అన్నారు. మీడియా ప్రశ్నకు కూడా ప్రభాస్ ఇదేరకమైన సమాధానం ఇచ్చాడు. బాహుబలి చిత్రంతోనే ప్రభాస్ కు దాదాపు 3 ఏళ్ళు గడచిపోయింది.

అతడే నిర్ణయించుకోవాలి
ప్రభాస్ కు పెళ్లి చేసుకోవాల్సిన వయసు వచ్చింది. అతడేం చిన్నపిల్లవాడు కాదు. ఈ విషయం గురించి అతడే నిర్ణయం తీసుకోవాలి అని కృష్ణం రాజు అన్నారు. ఈ వ్యాఖ్యలని బట్టి ప్రభాస్ సమీప భవిష్యత్తులో వివాహం చేసుకునేలా కనిపించడం లేదు.

సాహోతో బిజీగా
ప్రభాస్ సాహో చిత్రంతో బిజీగా ఉన్నాడు. బాహుబలి తరువాత ప్రభాస్ పెళ్లి ఉంటుందని అంతా భావించారు. కానీ అది జరగలేదు. సాహో చిత్రం 2019 నాటికి పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సమాధానం చెప్పుకుంటోన్న కృష్ణం రాజు
కృష్ణం రాజు ఎప్పుడు మీడియాకు ఎదుట పడినా ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్న ఎదురవుతూనే ఉంది. త్వరలోనే ప్రభాస్ పెళ్లి అంటూ గతంలో పలు మారు రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











