twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Krishnam Raju No More: టాలీవుడ్‌లో పెను విషాదం.. కృష్ణంరాజు కన్నుమూత

    |

    దేశ వ్యాప్తంగా ఉన్న పలు ఇండస్ట్రీల్లో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. కోవిడ్ ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇప్పటికే చాలా మంది గొప్ప గొప్ప ప్రముఖులు పలు కారణాలతో ప్రాణాలను కోల్పోయారు. చాలా కొద్ది రోజుల వ్యవధిలోనే ఎంతో మంది నటీనటులు, టెక్నీషియన్లు, ఆర్టిస్టులు ఇలా సినీ రంగంతో సంబంధం ఉన్న వాళ్లు మరణించారు.

    ఈ క్రమంలోనే తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో మరో పెను విషాదకర సంఘటన జరిగింది. కెరీర్ ఆరంభంలోనే ప్రత్యేకమైన మేనరిజం, డైలాగ్ డెలివరీలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకుని సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించిన రెబెల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

    అనారోగ్యంతో కృష్ణంరాజు ఇబ్బందులు

    అనారోగ్యంతో కృష్ణంరాజు ఇబ్బందులు

    సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో హవాను చూపించిన రెబెల్ స్టార్ కృష్ణంరాజు.. కొంత కాలంగా అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో తరచూ ఆయన అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో ఇప్పటికే పలుమార్లు ఆస్పత్రికి వెళ్లి చికిత్స కూడా తీసుకుంటోన్నారు. అంతేకాదు, కొంత కాలంగా వైద్యుల సలహాల మేరకు ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటోన్నారు.

    ఆస్పత్రిలోనే కన్నుమూసిన రెబెల్ స్టార్

    ఆస్పత్రిలోనే కన్నుమూసిన రెబెల్ స్టార్

    అనారోగ్య కారణాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోన్న కృష్ణంరాజు (83).. ఆదివారం తెల్లవారుజామున మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స చేస్తుండగానే పరిస్థితి విషమించింది. దీంతో ఆయన ఆదివారం ఉదయం 3.25 నిమిషాలకు కన్నుమూశారు.

    అభిమానుల కోసం... అంత్యక్రియలు

    అభిమానుల కోసం... అంత్యక్రియలు

    రెబెల్ స్టార్ కృష్ణంరాజు మరణ వార్త ఇటు సినీ పరిశ్రమలోనూ, అటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర విషాదాన్నే నింపింది. ఇక, ఆయన భౌతిక కాయాన్ని ముందుగా ఇంటికి తరలిస్తారని తెలిసింది. ఆ తర్వాత అభిమానుల సందర్శనార్థం ఫిలిం చాంబర్‌కు తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, కృష్ణంరాజు అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం జరుగుతాయని సమాచారం.

    అభిమానులు.. ప్రముఖుల సంతాపం

    అభిమానులు.. ప్రముఖుల సంతాపం

    టాలీవుడ్ సీనియర్ హీరో రెబెల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. దీంతో ఆయన మరణంపై అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అలాగే, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు కూడా సంతాపం తెలుపుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో రెబెల్ స్టార్ కృష్ణంరాజు మరణంపై పోస్టులు చేస్తున్నారు.

     అలా పరిచయం.. రెబెల్ స్టార్ పేరుతో

    అలా పరిచయం.. రెబెల్ స్టార్ పేరుతో

    రెబెల్ స్టార్ కృష్ణంరాజు 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. ఈ క్రమంలోనే 1966లో వచ్చిన 'చిలకా గోరింక' అనే సినిమాతో ఆయన పరిచయం అయ్యారు. అప్పటి నుంచి తనదైన చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. అంతేకాదు, సాహసోపేతమైన పాత్రలు చేస్తూ 'రెబెల్ స్టార్' అనే బిరుదును కూడా సొంతం చేసుకున్నారు.

    ప్రభాస్ సినిమానే కృష్ణంరాజుకు లాస్ట్

    ప్రభాస్ సినిమానే కృష్ణంరాజుకు లాస్ట్

    దాదాపు ఆరు దశాబ్దాల పాటు సినీ రంగంలో హీరోగా, విలన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా, నిర్మాతగా ఎన్నో చిత్రాలు చేసిన రెబెల్ స్టార్ కృష్ణంరాజు.. ఈ మధ్య కాలంలో పెద్దగా వెండితెరపై కనిపించడం లేదు. ఇక, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' మూవీనే ఆయనకు చివరి చిత్రం. ఈ సినిమా తెలుగు వెర్షన్‌లో కృష్ణంరాజు రామకృష్ణ పరమహంస పాత్రను పోషించారు.

    English summary
    Another Tragedy Placed in Telugu Film Industry. Famous Actor Krishnam Raju Passes Away Due to Health Issues.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X