twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "కేసీఆర్‌లో కృష్ణదేవరాయలు కనిపించారు, ఒకప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు కేసీఆర్"

    |

    కేసీఆర్ మాట్లాడుతుంటే చూపు తిప్పుకోవడం కష్టం. అదే పనిగా చూస్తే.. ఇలియానా అందమైన బోర్ కొట్టొచ్చు కానీ.. కేసీఆర్ వాగ్ధాటి ఎన్ని గంటలైనా మంత్ర ముగ్దుల్ని చేస్తుంది. దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పిన ఈ మాటలు కొట్టిపారేసేవేం కాదు.

    Recommended Video

    Prapancha Telugu Mahasabhalu : చెన్నై వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు !

    కేసీఆర్ ఎంఏ చదువుతున్న రోజుల్లో: ఆ ముగ్గురు మాట్లాడుతుంటే.. అలా వింటుండేవాడు!

    రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా.. వాగ్ధాటి విషయంలో ప్రత్యర్థులు సైతం కేసీఆర్ చాతుర్యాన్ని పక్క చాటుగానైనా మెచ్చుకోకుండా ఉండలేరు. తెలుగు భాషపై ఆయనకున్న పట్టు.. విషయాన్ని ప్రజలకు కమ్యూనికేట్ చేయడంలో ఆయనకున్న నేర్పు అలాంటివి.

    ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో మరోసారి కేసీఆర్ తన తెలుగు భాషా చాతుర్యాన్ని బయటపెట్టారు. తాజాగా ఇదే విషయంపై సీనియర్ హీరో కృష్ణంరాజు స్పందించారు.

     కృష్ణదేవరాయలను తలపించేలా:

    కృష్ణదేవరాయలను తలపించేలా:

    'ప్రపంచ తెలుగు మహాసభలలో కేసీఆర్‌ గారి ప్రారంభోపన్యాసం విన్నప్పుడు.. సినిమాల్లో కృష్ణదేవరాయల పాత్ర పోషించిన నాకు అష్టదిగ్గజాల సమేతంగా స్వయంగా పండితుడై తెలుగు భాషను అత్యున్నత శిఖరాలకు చేర్చిన ఆ కృష్ణదేవరాయలు కేసీఆర్‌లో కనిపించారు.' అని కృష్ణంరాజు అన్నారు.

    తెలుగు భాషపై పట్టు:

    తెలుగు భాషపై పట్టు:

    'నాకు తెలుసు.. కేసీఆర్ వేలాది పుస్తకాలు చదివారు. వేలాది పద్యాలను కంఠత పట్టినారు. అందుకే తెలుగు భాష మీద ఆయనకు ఉన్న పట్టేమిటో ఆయన ప్రారంభోపన్యాసంలో కనిపించింది. తెలుగు భాష మీద కేసీఆర్‌గారికి గల అభిమానం ఏమిటో ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో, తెలుగు భాషను ప్రపంచ వ్యాప్తంగా విస్తృతం చేయడంలో కనిపించింది.'

     ఒకప్పుడు ఎన్టీఆర్..

    ఒకప్పుడు ఎన్టీఆర్..

    'మహానుభావుడు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయి.. తెలుగు భాషకు, తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించారు. ఇప్పుడు బాహుబలి సినిమా దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తక్కువ కాదు అని నిరూపించారు.'

    ఇప్పుడు కేసీఆర్:

    ఇప్పుడు కేసీఆర్:

    'రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ గారికి, దర్శకుడిగా రాజమౌళి, ఇంత బ్రహ్మాండంగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించిన కేసీఆర్‌గారికి, యువనేత కేటీఆర్‌గారికి మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను.'

    ఇదే స్ఫూర్తితో ప్రతి తెలుగువాడు వారి వారి వృత్తిలో తెలుగు జాతిని, తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయడానికి కృషిచేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

     ఎందుకు రాలేదంటే?:

    ఎందుకు రాలేదంటే?:

    ప్రపంచ తెలుగు మహా సభలకు హాజరుకాకపోవడంపై కృష్ణం రాజు స్పందించారు. డిసెంబర్ 18న ఎల్బీ స్టేడియంలో జరిగిన వేడుకకు సినీ ప్రముఖులంతా హాజరైన సంగతి తెలిసిందే. అయితే తన గైర్హాజరి వెనుక సమాచార లోపమే తప్ప మరే ఇతర కారణాలు లేవన్నారు.

    English summary
    Senior Hero Krishnam Raju clarifies over his absence to World Telugu Conference on Dec 18th. He said communication problem is the fault behind that.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X