»   »  అన్నీ బద్దల్: నా కొడుకు ప్రభాస్ అద్భుతంగా నటించాడు

అన్నీ బద్దల్: నా కొడుకు ప్రభాస్ అద్భుతంగా నటించాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ రోజు విడుదలైన ‘బాహుబలి' చిత్రాన్ని ప్రభాస్ కుటుంబ సభ్యులు వీక్షించారు. ఈ సందర్బంగా కృష్ణం రాజు సతీమణి, ప్రభాస్‌కు పెద్దమ్మ అయిన శ్యామల దేవి స్పందించారు. బాహుబలి సినిమాపై, ప్రభాస్ పెర్ఫార్మెన్స్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

బాహుబలి సినిమా హాలీవుడ్ టాలీవుడ్ రికార్డులన్నింటినీ బద్దలు కొడుతుందని, ప్రభాస్ పెర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉందని, నా కొడుకు అద్భుతంగా నటించాడంటూ ఆమె ఎగ్జైట్ అయ్యారు. సెకండ్ పార్ట్ చూసే వరకు థియేటర్లో నుండి రావాలనిపించ లేదని శ్యామలదేవి అన్నారు.


Krishnam Raju's wife about Baahubali

రాజమౌళి సోదరుడు... కాంచి స్పందిస్తూ ‘బాహుబలి'తో రాజమౌళి మరో హిట్ కొట్టాడని, భారతీయ సినీ పరిశ్రమ గర్వించే సినిమా ‘బాహుబలి' అని చెప్పుకొచ్చారు. ఇంత గొప్ప సినిమాను విజయవంతంగా తెరకెక్కించిన నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలకు ఆయన అభినందనలు తెలిపారు.


ఇండియన్ సినీ చరిత్రలోనే భారీ సినిమా కావడంతో ‘బాహుబలి' చిత్రాన్ని చూసేందుకు సాధారణ ప్రేక్షకులతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఈ చిత్రం బాలీవుడ్ బిగ్ షాట్ కరణ్ జోహార్ సమర్ఫణలో బాలీవుడ్లో కూడా విడుదలైన నేపథ్యంలో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీ కూడా సినిమాను చూసేందుకు ఆసక్తి ప్రదర్శించారు. షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ తొలిరోజే ఈ సినిమానే హిందీలో వీక్షించారు.

English summary
Krishnam Raju's wife Shyamala Devi about Baahubali.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu