చేతులెత్తేసిన కృష్ణంరాజు: 'ఇక ఆ సంగతి ప్రభాస్‌కే తెలియాలి?'; అలాంటివైతే ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి!..

ఓ హీరో పెళ్లి గురించి ఇంతలా ఆరా తీయడం బహుశా టాలీవుడ్ చరిత్రలో ఒక్క ప్రభాస్ విషయంలోనే జరుగుతుందేమో!. ఏకంగా 'ప్రభాస్ పెళ్లి గోల' అంటూ షార్ట్ ఫిలింలు కూడా వచ్చేశాయంటే ఆయన పెళ్లి వార్త ఎంత క్యురియాసిటీగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

సరే, ఇదంతా పక్కనపెడితే.. ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఆయన పెదనాన్న కృష్ణంరాజే ఎప్పుడూ క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడాయన కూడా చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. ఇంతకీ ఏంటా విషయం..

ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు:

ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు:

ప్రభాస్‌ పెళ్లి గురించి ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు.అసలేమి అనుకోలేదు కూడా. నిన్న మొన్నటి వరకూ 'బాహుబలి పూర్తయిన వెంటనే పెళ్లి' అనేవాడు. ఇప్పుడు 'సాహో అవ్వాలి' అంటున్నాడు. ఎప్పుడు చేసుకుంటాడో తనకే తెలియాలి.'

Recommended Video

Prabhas Shocking Look For 'Sahoo' Movie ప్రభాస్ ఇలా మారిపోయాడేంటీ..?
చేతులెత్తేసినట్లేనా?:

చేతులెత్తేసినట్లేనా?:

ఎప్పుడు చేసుకుంటాడో తనకే తెలియాలి అని కృష్ణంరాజు చెప్పుకొచ్చారంటే ఇక ఆ విషయంలో ఆయన కూడా చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. విషయాన్ని ప్రభాస్ కే వదిలేసి.. తను కోరినప్పుడే దానిపై ఆలోచించాలని కృష్ణంరాజు డిసైడ్ అయ్యారేమో!

ప్రభాస్‌తో సినిమా:

ప్రభాస్‌తో సినిమా:

ప్రభాస్‌తో చేయబోతున్న సినిమా గురించి కూడా స్పందించారు కృష్ణంరాజు. 'నిజానికి మా గోపీకృష్ణ సంస్థలో ప్రభాస్‌ హీరోగా 'ఒక్క అడుగు' చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నాం. కానీ అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రభాస్‌తో ఓ సినిమా మొదలుపెట్టబోతున్నాం. రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు'.

'పద్మావత్'పై.., 'ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి'..:

'పద్మావత్'పై.., 'ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి'..:

చరిత్రకు సంబంధించిన కథల్ని టచ్ చేస్తున్నామంటేనే.. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. 'పద్మావత్' వివాదాలు చూస్తూనే ఉన్నాం కదా!.., చరిత్రను వక్రీకరించడం నేరమవుతుంది. అలాగని చరిత్రను న్నది ఉన్నట్టుగానూ తీయలేం. కొన్ని మెరుగులు అద్దాల్సిందే. 'తాండ్రపాపారాయుడు' సినిమా విషయంలో అదే ఫాలో అయ్యాం.

కృష్ణతో అనుబంధంపై:

కృష్ణతో అనుబంధంపై:

కృష్ణతో నాకు చాలా అనుబంధం ఉంది. మా ఇద్దరిని రాజకీయాల్లో చూడాలనుకుంటున్నామని ఆరోజుల్లో చాలామంది అడిగేవారు. ఇద్దరు కలిసి పార్టీ పెట్టండి అని సలహా ఇచ్చినవారు కూడా ఉన్నారు. కానీ అప్పట్లో మా ఇద్దరికీ రాజకీయాలంటే ఆసక్తి లేదు. ఆ భారం మోయడం ఇష్టం లేక దాని గురించి ఆలోచించలేదు.

బాహుబలిపై:

బాహుబలిపై:

'బాహుబలి' అందరిలో స్ఫూర్తి నింపిన సినిమా. 90శాతం సినీ ప్రేమికులు ఈ సినిమా చూశారు. బాహుబలి స్ఫూర్తితో గనుక సినిమా తీస్తే.. పదిలో కనీసం రెండు సినిమాలైనా ఆడుతాయి.

నేడు కృష్ణంరాజు పుట్టిన రోజు

నేడు కృష్ణంరాజు పుట్టిన రోజు

నేడు కృష్ణంరాజు పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. వ్యక్తిగత, సినీ, రాజకీయాంశాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ ఎదుగుదలను చూసి సంతోషపడుతున్న ఆయన.. భవిష్యత్తులో ప్రభాస్ మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నారు.

త్వరలోనే 50ఏళ్ల పండుగ:

త్వరలోనే 50ఏళ్ల పండుగ:

నటుడిగా 50ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఓ ప్రత్యేక వేడుకను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నా. అభిమానుల మధ్య ఐదు దశాబ్దాల పండుగను జరుపుకుంటాను. అయితే ఎప్పుడు?.. ఎక్కడ? లాంటి వివరాలన్నీ త్వరలోనే వెల్లడిస్తా. ఈ ఏడాది నటుడిగా మరిన్ని పాత్రలు చేయాలని కోరుకుంటున్నా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X