రామారావుగారు ఎన్నో మంచి పనులు చేశారు: ఎన్టీఆర్ ఆడియో లాంచ్‌లో కృష్ణం రాజు
మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించిన ప్రీ రీలీజ్ ఈవెంట్ కనివీని ఎరుగని రీతిలో నిర్వహించారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా ఈ వేడుకకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కృష్ణం రాజు మాట్లాడుతూ... ఈ రోజు చాలా గొప్పదినం. ఎన్టీరామారావు లాంటి మహానటుడు, దైవాంశసంభూతుడిపై సినిమా తీస్తున్నందుకు మా బాలకృష్ణను అభినందించాలో తెలియడం లేదు. నేను మొట్టమొదటి సినిమా కృష్ణవేణి చేసినపుడు పిలవడానికి వెళితే షూటింగ్ కేన్సిల్ చేసుకుని రామారావుగారు వచ్చారు. ఓసారి మేము కలిసి ఫ్లైట్లో ఊటి వెళుతుంటే పార్టీ పెడదామనుకుంటున్న విషయం చెప్పారు. ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం కృషిచేయబోతున్నట్లు, ఇక వారికోసమే కష్టపడబోతున్నట్లు చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఆయన అభిమానులకు, సన్నిహితులకు, ప్రజలకు ఎంతో మంచి చేశారు. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరూ అదృష్ట వంతులు. ఈ ఫంక్షన్లో నాకు మాట్లాడే అవకాశం రావడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నట్లు కృష్ణంరాజు తెలిపారు.
ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో, ట్రైలర్ లాంఛ్ వేడుకలు శుక్రవారం (డిసెంబర్ 21) గ్రాండ్‌గా ఫిల్మ్ నగర్ లోని JRC కన్వెన్షన్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు ఎన్టీఆర్ కుటుంబంతో పాటు సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణతో పాటు సినీ రంగానికి చెందిన ప్రముఖులందరూ హాజరయ్యారు.

నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా మాటలు అందించారు.


Click it and Unblock the Notifications











