'బిల్లా' సినిమా అంతా బాగున్నా..పతాక సన్నివేశాల్లో ఫైట్లు, మణిశర్మ బాణీలు మా గోపీకృష్ణా మూవీస్ బ్యానర్‌కు తగ్గ స్థాయిలో లేవనిపించింది. అదే విధంగా మహిళా ప్రేక్షకులను ఆకట్టుకునే సెంటిమెంట్ కూడా బాగా ఈ చిత్రంలో తగ్గింది. మా సంస్థ నుంచి వచ్చే తదుపరి చిత్రం యువతను, మహిళలను కూడా మెప్పించే విధంగా ప్లాన్ చేస్తాము అన్నారు కృష్ణంరాజు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుకల్ని ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ "తొలి మూడు వారాల్లోనే రూ.16.5 కోట్లు షేర్ దక్కించుకొంది మా చిత్రం. 'బిల్లా' సినిమా కోసం మా ప్రభాస్ ఎంతో కష్టపడ్డాడు. చిత్ర బృందం కూడా ఆ స్థాయిలోనే మనసుపెట్టి శ్రమించింది. వీళ్లందరి కష్టానికి తగ్గ ఫలితమే బిల్లా విజయం" అన్నారు. అదే విధంగా సినిమాలో లోపించిన విషయాలను కూడా చెప్పటం అందరికీ నచ్చింది. ఇక ఆయన, ప్రభాస్ కలిసి నటించిన చిత్రం 'బిల్లా' చిత్రానికి దర్శకుడు మెహర్ రమేష్. తమిళ బిల్లా' చిత్రానికి ఇది రీమేక్.