ప్రభాస్‌తో 'భక్తకన్నప్ప' రీమేక్
ప్రభాస్ కెరీర్ నేను ఊహించిన దానికంటే బాగుంది. తనకు భక్తకన్నప్ప సినిమా చాలా ఇష్టం. వీలైతే ప్రభాస్‌తో ఆ చిత్రాన్ని రీమేక్ చేస్తా అంటున్నారు సీనియర్ నటుడు కృష్ణం రాజు. ఆయన పుట్టినరోజు ఈ రోజు(శుక్రవారం). ఈ సందర్భంగా కలిసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే...ఈ మధ్య సినిమాల్లో నటించడం తగ్గించిన మాట నిజమే. కారణం ఏంటంటే నా దగ్గరకొచ్చే దర్శకులు నన్ను ఇంకా బొబ్బిలి బ్రహ్మన్న తరహా పాత్రల్లోనే ఊహించుకుని కథలు చెబుతున్నారు అన్నారు. ఇక ప్రభాస్ 'రెబల్' సినిమాలో లారెన్స్ నా పాత్రని తీర్చిదిద్దిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది అని చెప్పారు.
తన భవిష్యత్ ప్రణాళిక గురించి చెపుతూ.. త్వరలో దర్శకత్వం వహిస్తాను. సమాజంలో అవినీతి, లంచగొండితనం ఎక్కువైపోయాయి. ఈ అంశంపై ఎన్నో చిత్రాలొస్తున్నాయి. కానీ ఈ సమస్యని ఎత్తిచూపడమే కాదు పరిష్కారం కూడా ఆ చిత్రంలో చెబుతాను.మన సినిమా మార్కెట్‌ని బట్టే పెట్టుబడి ఉండాలి. మితిమీరిన బడ్జెట్‌తో సినిమాలు తీయడం ఎవరికీ మంచిది కాదు. అనువాద చిత్రాలు మాత్రమే సమస్య కాదు. ఇంకా ఎన్నో సమస్యలున్నాయి. ముందు వాటిపై దృష్టిపెడితే మంచిది. అలాగే 'ప్రేక్షకుల్లో ఎంతో మార్పు వచ్చింది. కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కానీ ప్రేక్షకులు మారినంతగా మన దర్శకులు మారలేదు. చాలా మంది పాత పద్ధతుల్లోనే సినిమాలు తీస్తున్నారు. నవ్యత ఉన్న కథా చిత్రాలు రూపొందిస్తే విజయాల శాతం పెరుగుతుంద' అన్నారు. కృష్ణం రాజు కు ధట్స్ తెలుగు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.


Click it and Unblock the Notifications











