ప్రభాస్‌కి భార్యగా అలాంటి అమ్మాయి కావాలి, వాళ్ళ పెదనాన్న పద్దతే.. కృష్ణంరాజు సతీమణి!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి మీడియాలో ఎన్ని వార్తలు వస్తున్నా అవన్నీ పుకార్లే అని ఎప్పటికప్పుడు తేలిపోతోంది. మీడియా నుంచి ఈ ప్రశ్న ఎదురైనప్పుడలా ప్రభాస్ తప్పించుకుంటున్నాడు. ప్రభాస్ పెళ్లి విషయంలో అతడి పెదనాన్న కూడా మీడియా ప్రశ్నలతో విసిగిపోతున్నాడు. ఇవే ప్రశ్నలు తాజాగా కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవికి ఓ ఇంటర్వ్యూలో ఎదురయ్యాయి. ప్రభాస్ కి భార్యగా రాబోయే అమ్మాయి గురించి శ్యామలాదేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సరదాగా తీసుకుంటాం

సరదాగా తీసుకుంటాం

ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పటి వరకు మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి. వాటన్నింటి మేము సరదాగా తీసుకుంటాం కానీ పెద్దగా పట్టించుకోము అని వ్యాఖ్యానించారు. ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంతో పాటు రాధాకృష్ణ దర్శత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటాని చెప్పినట్లు శ్యామలాదేవి వివరించారు.

ప్రభాస్‌కి భార్యగా

ప్రభాస్‌కి భార్యగా

ఈ సందర్భంగా శ్యామలాదేవి మాట్లాడుతూ ప్రభాస్ కి కాబోయే భార్య ఎలా ఉండాలో తెలిపారు. మాది చాలా పెద్ద కుటుంబం. తామంతా ఎంతో ఆప్యాయంగా ఉంటాం. మా అందరితో కలిసిపోయే అమ్మాయి ప్రభాస్ కు భార్యగా రావాలని తాము కోరుకుంటున్నట్లు శ్యామలాదేవి తెలిపారు. ఆ రోజు కోసం తామంతా ఎదురుచూస్తున్నట్లు శ్యామలాదేవి తెలిపారు.

ప్రభాస్‌కి కూడా అదే పద్ధతి

ప్రభాస్‌కి కూడా అదే పద్ధతి

ఇక కృష్ణంరాజు గురించి మాట్లాడుతూ.. ఆయన గొంతు గాంభీర్యంగా ఉంటుంది. కానీ ఆయన ఎంతటి సున్నిత మనస్కుడో కాసేపు మాట్లాడితే అర్థం అవుతుందని అన్నారు. స్త్రీలపైన ఆయన అపారమైన గౌరవాన్ని ప్రదర్శిస్తారు. ప్రభాస్ కు కూడా అదే పద్ధతి వచ్చింది అని అన్నారు. కృష్ణంరాజు గారితో మాట్లాడాలంటే ఎవరైనా భయపడాల్సిందే. కాసేపు మాట్లాడక ఆయన అభిమానులుగా తిరిగి వెళతారని శ్యామలాదేవి తెలిపారు.

అలా పెళ్లి జరిగింది

అలా పెళ్లి జరిగింది

మా పెళ్ళికి ముందు నన్ను చూడడానికి కృష్ణంరాజుగారి బంధువులు వచ్చారు. ఆ సమయంలో నేను చిన్నపిల్లలతో ఆడుకుంటున్నాను. వాళ్ళు వెళ్లి కృష్ణంరాజుగారితో ఇదే విషయం చెప్పారట. ఆయన వెంటనే పెళ్ళికి ఓకే చెప్పారు. చిన్నపిల్లలతో ఆడుకునే వారు మంచి మనస్తత్వం కలిగి ఉంటారనేది ఆయన అభిప్రాయం. తరచుగా ప్రభాస్ కుటుంబ సభ్యులే అతడి పెళ్లి గురించి స్పందిస్తున్నారు. ప్రభాస్ మాత్రం తప్పించుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రెండు చిత్రాలు పూర్తికావాలంటే మరో ఏడాది సమయం పడుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X