Krishana no more ఇద్దరు ఒకేసారి వెళ్లిపోయారు.. తల్లైనా, తండ్రైనా మహేషే.. భోరున విలపించిన కృష్ణంరాజు సతీమణి
సూపర్ స్టార్, నటశేఖర కృష్ణ గుండెపోటుతో మరణించడం సినీలోకాన్ని విషాదంలో ముంచెత్తింది. డేరింగ్, డాషింగ్ హీరో ఇకలేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పుట్టెడు విషాదంలో మునిగిన మహేష్ బాబును పరామర్శించారు. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు ఘట్టమనేని ఫ్యామిలీని వ్యక్తిగతంగా ఓదార్చారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు సతీమణి శ్యామలదేవీ మీడియాతో మాట్లాడుతూ..

ఒకేసారి వెళ్లిపోవాలని అనుకొని..
ఇద్దరం ఒకేసారి వెళ్లిపోవాలని అనుకొన్నారేమో.. ఒకేసారి ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. మహేష్ బాబుకు వరుసగా విషాదాలు ఎదురు కావడం.. తీరని కష్టం. అలాంటి వాటిని తట్టుకోవడం కష్టమే అయినా.. మనం ఏం చేస్తాం. కృష్ణ, కృష్ణంరాజు ఇద్దరు సినిమా పరిశ్రమకు ఫిల్లర్స్. అలాంటి వారిద్దరు ఒకేసారి వెళ్లిపోవడం చాలా బాధగా ఉంది అంటూ కృష్ణంరాజు సతీమణి శ్యామలదేవీ భోరున విలపించారు.

సుల్తాన్ సినిమా షూటింగులో
సుల్తాన్ సినిమా షూటింగ్ జరిగినప్పటి నుంచి కృష్ణ ఫ్యామిలీతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ నెల రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవుల్లో షూటింగ్ చేశాం. ఆ సమయంలో కృష్ణ, కృష్ణంరాజకు విజయ నిర్మల వంట చేసి పెట్టేవారు. అప్పటి నుంచి బాలకృష్ణతో మంచి రిలేషన్ ఏర్పడింది అని కృష్ణంరాజు సతీమణి శ్యామలదేవీ కంటతడి పెట్టుకొని చెప్పారు

కృష్ణ బర్త్ డే రోజున కృష్ణంరాజు ఫోన్ చేసి..
కృష్ణ గారైనా, విజయనిర్మల గారైనా నాకు చాలా ఇష్టం. విజయనిర్మల గారి అబ్బాయి వీకే నరేష్ అంటే మాకు ప్రేమ. కృష్ణంరాజు గారు.. ఎప్పుడు నరేష్‌కు ఫోన్ చేసి కృష్ణ యోగ క్షేమాలు తెలుసుకొనే వారు. నరేష్ మాకు కొడుకు మాదిరే ఉండేవారు. కృష్ణ బర్త్ డే రోజున కృష్ణం రాజు ఫోన్ చేసి విషెస్ చెప్పారు. ఆ సమయంలో చేపల కూర చేసి పెడుతాను... మా ఇంటికి రా అని కృష్ణంరాజును ఆహ్వానించారు. అలాంటి ఇద్దరు గొప్ప వ్యక్తులు లేకపోవడం బాధాకరం అని కృష్ణంరాజు సతీమణి శ్యామలదేవీ గద్గద స్వరంతో వెల్లడించారు.

మహేష్ బాబే తండ్రిగా, తల్లిగా అంటూ
కృష్ణ, కృష్ణంరాజు వదిలిన గుర్తులతో బతకాలి. కృష్ణ గారి ఆడపిల్లల పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతున్నది. ఇక తన అక్కా, చెల్లెల్లకు తండ్రి అయినా.. తల్లి అయినా మహేష్ బాబే. వారి కుటుంబాన్ని మహేష్ ముందుకు నడిపించాలి. నరేష్ కూడా కృష్ణ గారిని బాగా చూసుకొన్నారు అని కృష్ణంరాజు సతీమణి శ్యామలదేవీ అన్నారు.
కృష్ణ, కృష్ణంరాజు అమరజీవులు అంటూ
భూమీ, ఆకాశం ఉన్నంత వరకు అమరజీవులుగా మిగిలిపోతారు. వారిద్దరూ చిరస్మరణీయులుగా ఉంటారు. వారి జాపకాలతో బతుకాల్సి ఉంది. కృష్ణ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం అంటూ కృష్ణంరాజు సతీమణి ఆవేదనకు గురయ్యారు. మాట్లాడినంత సేపు కంటతడి పెట్టుకొంటూ శ్యామలదేవీ భోరున విలపించారు. కృష్ణం రాజు సతీమణి చూసి అక్కడున్న వారంతా భావొద్వేగానికి గురయ్యారు.


Click it and Unblock the Notifications











