ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ.. స్వయంగా ఆవిడే చెప్పేసింది.. ఆ అమ్మాయి తోనే!
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే ఠకీమని చెప్పే పేరు ప్రభాస్. యంగ్ రెబల్ స్టార్‌గా వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ హీరో పెళ్లి విషయంలో చాలా స్లోగా ఉన్నాడు. 40 సంవత్సరాల వయసొచ్చినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. దీంతో టాలీవుడ్ లోకమంతా ఈయన పెళ్లి కోసం ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి ప్రభాస్ పెళ్లి గురించి ఓ క్లారిటీ ఇచ్చింది. వివరాల్లోకి పోతే..

ప్రభాస్ పెళ్లి.. ఇప్పుడిదే హాట్ టాపిక్
గత కొన్ని నెలలుగా ప్రభాస్ పెళ్లి సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. ఆయన పెళ్లిపై రకరకాల రూమర్స్ కూడా షికారు చేశాయి. వెండితెరపై ఆయన బ్యూటిఫుల్ జోడీ అనుష్కను పెళ్లాడవచ్చనే టాక్ కూడా వచ్చింది. దీంతో ప్రభాస్ పెళ్లి అప్డేట్ కోసం టాలీవుడ్ లోకమంతా ఆతృతగా ఎదురుచూస్తోంది.

బాహుబలి, సాహో తర్వాత అనుకుంటే..
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న ప్రభాస్.. తన బాహుబలి సిరీస్ పూర్తిచేసుకోగానే పెళ్లి చేసుకుంటాడని అన్నారు. కానీ అది జరగలేదు. ఆ వెంటనే సాహో తర్వాత ప్రభాస్ ఇంట పెళ్లి బాజా మోగనుందని వార్తలు వచ్చాయి. అది కూడా కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో ప్రభాస్ పెళ్లి గురించి జనాల్లో అనుమానాలు మొదలయ్యాయి.

ఎటూ తేల్చని ప్రభాస్.. రూమర్ల ప్రవాహం
పెళ్లి విషయమై ఏళ్లకేళ్లుగా లాగుతూ ఏదీ తేల్చడం లేదు ప్రభాస్. అయన పెళ్లిపై అదే సస్పెన్స్ రన్ అవుతోంది. ఎప్పటికప్పుడు ప్రభాస్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు. ఇక ఈయన పెళ్లిపై చక్కర్లు కొడుతున్న రూమర్స్‌కి హద్దు అదుపు లేదు. ఇలాంటి పరిస్థితిలో ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ క్లారిటీ ఇవ్వడం ఆసక్తి కలిగించింది.

అభిమానులే కాదు.. కుటుంబ సభ్యులు కూడా
తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి.. ప్రభాస్ పెళ్లి గురించి ఓ క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న జాన్ సినిమా పూర్తవగానే ప్రభాస్ పెళ్లి పీటలెక్కుతాడని చెప్పింది. ప్రభాస్ పెళ్లి కోసం అభిమానులే కాదు.. తాము కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఆమె పేర్కొంది.

అప్పుడే బాజా బజంత్రీ
ఇక ప్రభాస్ పెళ్లి గురించి, ఆయన చేసుకోబోయే అమ్మాయి గురించి కూతరు విషయంలో మీడియాలో వచ్చే వార్తలు చూసి మేము ఎంజాయ్ చేస్తుంటామని శ్యామలా దేవి తెలిపింది. తమ కుటుంబంలో కలిసిపోయే అమ్మాయి కోసం వెతుకుతున్నామని, ఆ అమ్మాయి దొరకగానే బాజా బజంత్రీ మోగిస్తామని చెప్పింది శ్యామలా దేవి.

1960 కాలం.. ప్రభాస్
యూవీ క్రియేషన్స్, గోపి కృష్ణా మూవీస్ సంస్థలు జాన్ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి దాదాపుగా 180 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. 1960 కాలం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం.


Click it and Unblock the Notifications











