కృష్ణం రాజు బర్త్ డే స్పెషల్ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ టీజర్

By Bojja Kumar

హైదరాబాద్: ప్రముఖ నటుడు కృష్ణం రాజు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న ‘ఎవడే సుబ్రహ్మణ్యం' స్పెషల్ టీజర్ విడుదల చేసారు. కృష్ణం రాజు అసలు పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు. 1940న జన్మించాడు. 1970, 1980లలో తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నటుడుగా వెలుగొందారు. తెలుగు సినిమా పరిశ్రమలో యంగ్ రెబల్ స్టార్ గా తన హవా కొనసాగిస్తున్న ప్రభాస్‌కు కృష్ణం రాజు స్వయంగా పెదనాన్న అవుతారు.

‘ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమా విషయానికొస్తే ప్రియాంక దత్.... స్వప్న సినిమా పతాకం నిర్మిస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. నాని హీరో. మాళవికా నాయర్‌ హీరోయిన్. ఈ చిత్రంలో కొంతభాగం ఎవరెస్ట్‌పై తెరకెక్కించారు. ప్రియాంక దత్ మాట్లాడుతూ... "సుబ్రహ్మణ్యం ఎవరంటే..? సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. నెలకు లక్షల్లో జీతం. అన్ని బ్యాంకుల క్రెడిట్‌ కార్డులూ ఉన్నాయి. ఓ మనిషికి గుర్తింపు ఈ అంకెలేనా? కానీ సుబ్రహ్మణ్యం దృష్టిలో ఈ అంకెలే ప్రపంచం. అతని జీవితాన్ని మలుపు తిప్పడానికి ఓ అమ్మాయి వచ్చింది. ఆమె ఎవరు? ఆ తరవాత ఏమైంది? తెలుసుకోవాలంటే 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమా చూడాలి" అంటున్నారు ప్రియాంకాదత్‌.

Krishnam Raju Yevade Subramanyam Birthday Teaser

దర్శకుడు మాట్లాడుతూ... ''ఎవరెస్ట్‌పై తీసిన తొలి భారతీయ సినిమా మాదే. అక్కడ షూటింగ్‌ అనుకొన్నంత సులభం కాదు. మైనస్‌ 10 డిగ్రీల ఉష్టోగ్రత వద్ద చిత్రీకరణ జరిపాం. నేపాల్‌లోని కాఠ్‌మాండూ నుంచి లుక్లా వరకూ విమాన ప్రయాణం. అక్కడి నుంచి ఎడ్ల బళ్లూ, కాలినడకే దారి. దూద్‌ కాశీ వెళ్లడానికి 10 రోజులు పట్టింది. మధ్యమధ్యలో కొన్ని షాట్స్‌ తీసుకొంటూ ప్రయాణం సాగించాం. అక్కడున్న ఇళ్లలో బస చేసేవాళ్లం. వంటింట్లో మంట పెట్టేవారు.

అక్కడే చలి కాచుకొనేవాళ్లం. బయట అడుగుపెడితే ఎముకలు కొరికే చలి. ఎలాంటి సౌకర్యాలు లేని చోట పదిహేను రోజులు ఉన్నాం. దూద్‌ కాశీలో ఐదు రోజులు చిత్రీకరణ జరిపాం. ఆ ప్రదేశం చూశాక మేం పడిన కష్టాలన్నీ మాయమైనట్టు అనిపించాయి. నిజానికి ఎవరెస్ట్‌ వెళ్లకుండా ఏ స్విట్జర్ల్లాండ్‌లోనో షూటింగ్‌ జరిపేయొచ్చు. కానీ ఎలాగైనా అక్కడే చేయాలనే పట్టుదలతో వెళ్లాం. ఫిబ్రవరిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు.

ఈ సినిమా ఎవరెస్ట్ ప్రాంతంతో చిత్రీకరణ జరుపుకుంది. ఎవరెస్ట్ బేస్ మెంట్ క్యాంపులో సముద్రమట్టానికి 5300 మీటర్ల ఎత్తులో షూటింగ్ చేశారట. ఈ విషయాన్ని హీరో నానియే తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ యంగ్ హీరో నాని ఈ సినిమా విజయంపై చాలా నమ్మకంగా ఉన్నాడట.సంగీతం: రధన్‌, ఛాయాగ్రహణం: అమిత్‌, భరత్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X