Don't Miss!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్‌తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాణా కంటే వెనకపడ్డ నాగార్జున!
హైదరాబాద్ : హీరో రాణా నటించని 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రం యూఎస్ బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతోంది. నవంబర్ 30న గ్రాండ్ గా విడుదలైన ఈచిత్రానికి రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్.... రెబల్, దేనికైనా రెడీ, డమరుకం చిత్రాలు నాలుగు రోజుల పాటు రాబట్టి దానికంటే ఎక్కవగా ఉన్నాయి.
ప్రభాస్ నటించిన 'రెబల్' చిత్రం 56 స్ర్కీన్లలో విడుదలై తొలి వారాంతంలో యూఎస్ బాక్సాఫీసు వద్ద రూ. 50 లక్షలు కలెక్ట్ చేసింది. మంచు విష్ణు నటించిన 'దేనికైనా రెడీ' 26 స్క్రీన్లలో విడుదలై తొలి వారాంతంలో రూ. 51.47 లక్షలు($95,151) రాబట్టింది. నాగార్జున టించిన డమరుకం చిత్రం 20 స్క్కీన్లలో విడుదలై 20 స్క్రీన్లలో విడుదలై రూ. 60.47 లక్షలు($1,08,882) వసూలు చేసింది.
తాజాగా రాణా నటించిన కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రం పై మూడుచిత్రాలతో పోలిస్తే తొలి వారాంతంలో భారీగా కలెక్షన్లు రాబట్టింది. యూఎస్ఎ వ్యాప్తంగా 30 స్క్రీన్లలో విడుదలై ఈ చిత్రం తొలి రెండు రోజుల్లో రూ. 92 లక్షలు($169,518) కలెక్ట్ చేసింది. శుక్రవారం $83,840 వసూలు కాగా, శనివారం $85,678 వసూలయ్యాయి. రాణా సినిమాకు ఈ రేంజిలో కలెక్షన్స్ వస్తాయని ఎవరూ ఊహించలేదు.
ఫస్ట్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బేనర్ పై నిర్మించిన ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. నటీనటులు: రాణా, నయనతార, మిలింద్ గునాజీ, కోట శ్రీనివాసరావు, రఘుబాబు, బ్రహ్మానందం, హేమ, ఎల్బీ శ్రీరామ్, నాగినీడు, సత్యం రాజేష్ తదితరులు. ప్రత్యేక గీతంలో వెంకటేష్, సమీరారెడ్డి గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. సంగీతం: మణిశర్మ, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: వీఎస్ జ్ఞానశేఖర్, నిర్మాతలు: జాగర్లమూడి సాయిబాబు, వై.రాజీవ్‌రెడ్డి.