‘కృష్ణం వందే జగద్గురుమ్’ సెన్సార్ కట్స్ ఇవే...
హైదరాబాద్ : హీరో దగ్గుబాటి రాణా, దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో రూపొందుతున్న 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రం సోమవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసున్న సంగతి తెలిసిందే. సెన్సార్ బోర్డు వారు ఈచిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసారు. తాజాగా ఈచిత్రంలో సెన్సార్ కటింగ్ కు గురైన సన్నివేశాలు, డైలాగుల వివరాలు బయటకు వచ్చాయి. దాదాపు 14 చోట్ల సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది.
1. సాంగులో 'జన గన మన' పదాలు రెండు సార్లు రావడాన్ని డిలీట్ చేయాలి
2. డైలాగుల్లో వచ్చే సంకనాకి, వాడెమ్మ, దీనమ్మ, వాడెబ్బ పదాలను డిలీట్ చేయాలి లేదా మ్యూట్ చేయాలి
3. 'సంసార జీవితానికి పనికి రాకుండా' అనే పదాన్ని తొలగించాలి.
4. 'మైనింగ్ మాఫియా విత్ రెఫరెన్స్ టు బల్లారి' అనే అనే డైలాగ్ డిలీట్ చేయాలి.
5. సాంగులో తొడల ఎక్స్ ఫోజింగ్ డిలీట్ చేయాలి.
6. రెండో సాంగులో స్తనాలపై హాండ్ షేకింగ్, హిప్(నడుము కింది భాగం)షేకింగ్ సన్నివేవాలు తొలగించాలి.
7. నాలుక కోసే సన్నివేశాలు డిలీట్ చేయాలి.
8. మీడియాను సూచిస్తూ 'బఫూన్' అనే పదాన్ని డిలీట్ చేయాలి.
9. సిబిఐలోకి ఎందుకు వచ్చావు అనే పదంతో పాటు సిబిఐ ఆఫీసర్‌ను లాండ్ మైన్ తో చంపే సన్నివేశం డిలీట్ చేయాలి
10. డైలాగుల్లో 'బెడ్ రిలేషన్', 'పక్కేసావ్' అనే పదాలను తొలగించాలి.
11. సింగిల్ షో, రూమ్ ఇస్తాను, అడ్వాన్స్ ఇస్తాను, మొత్తం పేమెంట్ మార్నింగ్ సెటిల్ చేస్తాను అనే డైలాగులు డిలీట్
12. పుడింగి అనే డైలాగు డిలీట్ లేదా మ్యూట్ చేయాలి
13. సినిమా మొత్తంలో ఫైటింగుల్లో 50% కోత
14. విటుడు అనే పదం డిలీట్ లేదా మ్యూట్ చేయాలి
ఈ చిత్రం స్టోరీ విషయానికొస్తే... గనుల్ని కొల్లగొట్టి వ్యాపారం చేస్తూ భూమాతకు గర్భశోకం కలిగిస్తున్న అభినవ భూభకాసురుల్ని అంతమొందించే అభినవ కృష్ణుడు కథే 'కృష్ణం వందే జగద్గురుం'. ఈ చిత్రంలో రాణా థియేటర్ ఆర్టిస్టుగా కనిపించున్నాడు. నయనతార హీరోయిన్ గా రాణా సరసన చేస్తోంది. ఈ పాత్ర చిత్రంలో కీలకమై నడుస్తుంది. ఈ చిత్రం నవంబర్ 30న విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్, సంగీతం: మణిశర్మ, నిర్మాతలు: సాయిబాబు జాగర్లమూడి, వై. రాజీవ్ రెడ్డి, దర్శకత్వం: క్రిష్.


Click it and Unblock the Notifications











