twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సెన్సార్ రిపోర్ట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: హీరో దగ్గుబాటి రాణా, దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో రూపొందుతున్న 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రం సోమవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈచిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసారు. అయితే సినిమాలో ఎన్నీ సీన్లు కట్ చేసారు అనే విషయం తేలియాల్సి ఉంది.

    ఈ చిత్రం నవంబర్ 9న రిలీజ్ అవుతుందని ప్రచారం జరిగినప్పటికీ... తాజాగా అందిన సమాచారం ప్రకారం నిర్మాతలు ఈ నెల 16 లేదా 23న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే రోజు రాణా బంధువు నాగార్జున నటిస్తున్న 'డమరుకం' విడుదల ఉండటంతో కావాలనే ఈచిత్రం విడుదల కాస్త పోస్టు పోన్డ్ చేసినట్లు తెలుస్తోంది.

    భిన్నమైన సినిమాలకు కేరాప్ అడ్రస్ గామారిన క్రిష్ కూడా.... ఇప్పటి వరకు యాక్షన్ నేపథ్యాన్ని ఎంచుకోలేదు. తాజాగా 'కృష్ణం వందే జగద్దురుమ్" సినిమా యాక్షన్ అంశాలతో విభిన్నంగా తెరకెక్కుతోంది. నయనతార హీరోయిన్ గా రాణా సరసన చేస్తోంది. నయనతార పాత్ర పేరు దేవిక. ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఈ పాత్ర చిత్రంలో కీలకమై నడుస్తుంది.

    ఈ చిత్రం స్టోరీ విషయానికొస్తే... గనుల్ని కొల్లగొట్టి వ్యాపారం చేస్తూ భూమాతకు గర్భశోకం కలిగిస్తున్న అభినవ భూభకాసురుల్ని అంతమొందించే అభినవ కృష్ణుడు కథే 'కృష్ణం వందే జగద్గురుం'. ఈ చిత్రంలో రాణా థియేటర్ ఆర్టిస్టుగా కనిపించున్నాడు. చదివింది బీటెక్‌. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్‌, సంగీతం: మణిశర్మ, నిర్మాతలు: సాయిబాబు జాగర్లమూడి, వై. రాజీవ్ రెడ్డి, దర్శకత్వం: క్రిష్.

    English summary
    Rana Daggubati’s ‘Krishnam Vande Jagadgurum’ has received a U/A certificate from the censor board. Rana and Nayantara will be seen as the lead pair in this movie. Krish is the director of the movie and Mani Sharma is the music director.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X