‘కృష్ణం వందే జగద్గురుమ్’ టాక్ ఏంటి?

అయితే అందరి అంచనాలు తలక్రిందులయ్యాయి. సినిమా బిలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. గమ్యం, వేదం తరహాలో మానవీయ విలువలతో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసేందుకు దర్శకుడు క్రిష్ ప్రయత్నించినా....ఈ చిత్రం ఆ రేంజిలో లేక పోవడం ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఇక మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు చేసిన కొన్ని ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కాలేదనే టాక్ వినిపిస్తోంది.
అయితే నటన విషయంలో మాత్రం రాణా విమర్శకుల ప్రశంసలు అందుకోవడం ఖాయం. గత సినిమాల కంటే ఉన్నతంగా నటించి తనలో సత్తా ఉందని నిరూపించాడు. మరి ఇలాంటి నెగెటివ్ టాక్ నేపథ్యంలో బాక్సాఫీసు వద్ద సినిమా ఏరేంజిలో వసూలు చేస్తుందో చూడాలి.
ఫస్ట్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్ పై నిర్మించిన ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. నటీనటులు: రాణా, నయనతార, మిలింద్ గునాజీ, కోట శ్రీనివాసరావు, రఘుబాబు, బ్రహ్మానందం, హేమ, ఎల్బీ శ్రీరామ్, నాగినీడు, సత్యం రాజేష్ తదితరులు. ప్రత్యేక గీతంలో వెంకటేష్, సమీరారెడ్డి గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. సంగీతం: మణిశర్మ, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: వీఎస్ జ్ఞానశేఖర్, నిర్మాతలు: జాగర్లమూడి సాయిబాబు, వై.రాజీవ్‌రెడ్డి.


Click it and Unblock the Notifications











