ప్రస్తుత రాజకీయాలకు టచ్ కాదు: క్రిష్
హైదరాబాద్: 'కృష్ణం వందే జగద్గురుమ్' ఫిక్షన్ ఫిల్మ్. ప్రస్తుత రాజకీయాలకు టచ్ కాదు అంటున్నారు దర్శకుడు క్రిష్. గమ్యం, వేదం చిత్రాల ద్వారా తానేంటో నిరూపించుకున్న దర్శకుడు క్రిష్. ఆయన తాజా చిత్రం కృష్ణం వందే జగద్గురుమ్. దగ్గుపాటి రాణా హీరోగా చేస్తున్న ఈ చిత్రం ఈ రోజు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.
"నేను, రాణా ఎప్పుడూ మీడియాకు దగ్గరగా ఉంటాం. మేం కలిసి చేసే సినిమాకు మంచి కథ దొరికింది. దాన్ని చెడగొట్టకుండా చేయాలనే ఉద్దేశంతో 'కృష్ణం వందే జగద్గురుమ్'కోసం పనిచేశాం. పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్. జర్నలిస్ట్ దేవికగా నయనతార నటించారు. ఆమె తన పాత్రకు తొలిసారి డబ్బింగ్ చెప్పుకున్నారు'' అని దర్శకుడు క్రిష్ చెప్పారు.
అలాగే "రాణాలోని టాలెంట్ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. తను మాత్రమే చేయగల పాత్ర ఇది. రివెంజ్ స్టోరీ. సినిమా చూసి వెంకటేష్‌గారు చాలా మెచ్చుకున్నారు. చెడు, మంచి మధ్య జరిగిన కథ. మానసిక, సామాజిక సంఘర్షణ ఉంటుంది. ప్రతి పాత్ర గొప్పగా వచ్చింది. సురభి కళాకారులు కూడా కొంతమంది నటించారు. మణిశర్మ సంగీతం, సిరివెన్నెల సాహిత్యం, బుర్రా సాయిమాధవ్ డైలాగులు, జ్ఞానశేఖర్ ఫోటోగ్రఫీ, కోటగారి పాత్ర ప్రతిదీ హైలైట్ అవుతుంది. రాణాతో క్రిష్ మంచి సినిమా తీశాడని అందరూ మెచ్చుకుంటారన్న నమ్మకం ఉంది త్వరలో తమిళం, మలయాళంలో విడుదల చేస్తాం'' అని చెప్పారు.
రాణా మాట్లాడుతూ "నాకు మాయాబజార్ అంటే ఇష్టం. ఘటోత్కచుడంటే ఇష్టం. ఎస్వీఆర్ అంటే ఇష్టం. ఈ చిత్రంలో ఘటోత్కచుడిగా, అభిమన్యుడిగా నటించాను. నరసింహావతారం ఎలా ఉందో ప్రేక్షకులే చెప్పాలి. చిన్నప్పటి నుంచి నాకు నచ్చిన, నాకు అర్థమైన కథల్లోని పాత్రలను తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాను. ఇంత భారీ యాక్షన్ అడ్వెంచరస్ చిత్రాన్ని ఇంతకు ముందు చేయలేదు. పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్. అయినా కొత్తగా అనిపిస్తుంది.
కొత్త నేపథ్యం, కొత్త అంశాలతో ముడిపడి ఉంటుంది. చిన్నాన్న సినిమా చూసి ఎగ్జైట్ అయ్యి మెచ్చుకున్నారు'' అని అన్నారు. "రాణా కెరీర్‌లో నిలిచిపోయే సినిమా అవుతుంది. సంభాషణల రచయితగా నాకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. క్రిష్ గత చిత్రాలకన్నా మరింత గ్రాండ్‌గా ఉంటుంది'' అని సాయిమాధవ్ బుర్రా తెలిపారు.


Click it and Unblock the Notifications











