twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కృష్ణం వందే జగద్గురుమ్’ టీం రూ. 2 లక్షల విరాళం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రాణా-నయనతార హీరో హీరోయిన్లుగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్'. ఈ చిత్రం నిన్న గ్రాండ్ గా విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది. ఈనేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ సభ్యులు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నడుస్తున్న 'నైస్ ట్రస్ట్ ఆర్గనైజేసన్' అనే స్వచ్ఛంద సంస్థకు రూ. 2 లక్షల విరాళం అందించారు.

    'నైస్ ట్రస్ ఆర్గనైజేషన్' అనే స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల్లోని పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం పని చేస్తోంది. పేద విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంలో భాగంగా వారికి పుస్తకాలు, బట్టలు ఇతర వస్తువులను అందించే కార్యక్రమాలు చేపడుతోంది.

    ఇక 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రం విశేషాల్లోకి వెళితే.... బాక్సాఫీసు వద్ద ఈచిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే నటన విషయంలో మాత్రం రాణా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఫస్ట్ట్ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్ పై నిర్మించిన ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు.

    నటీనటులు: రాణా, నయనతార, మిలింద్‌ గునాజీ, కోట శ్రీనివాసరావు, రఘుబాబు, బ్రహ్మానందం, హేమ, ఎల్బీ శ్రీరామ్‌, నాగినీడు, సత్యం రాజేష్‌ తదితరులు. ప్రత్యేక గీతంలో వెంకటేష్‌, సమీరారెడ్డి గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. సంగీతం: మణిశర్మ, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: వీఎస్ జ్ఞానశేఖర్, నిర్మాతలు: జాగర్లమూడి సాయిబాబు, వై.రాజీవ్‌రెడ్డి.

    English summary
    ‘Krishnam Vande Jagadgurum’ unit members donates Rs.2 lakhs for ‘Nice Trust Organization’. This organization works for the improvements of standards of poor children in Hyderabad and Ranga Reddy district.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X