twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కృ.క.ఇ... రామానాయుడికి అంకితం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సుధీర్ బాబు, నందిత జంటగా ఆర్.చంద్రు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ'. కన్నడ ‘చార్మినార్' చిత్రానికి రీమేకిది. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా-శ్రీధర్ నిర్మిస్తున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకుంటోంది.

    ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ...‘చార్మినార్ సినిమా చూడగానే ఆ కథతో ప్రేమలో పడిపోయాను. వెంటనే తెలుగు హక్కులు సొంతం చేసుకుని అదే దర్శకుడితో తెలుగులో సినిమా ప్రారంభించాను. చక్కని లవ్ ఎంటర్టెనర్ ఇది. ఎటువంటి వల్గారిటీ లేకుండా చంద్రు అద్భుతంగా తెరకెక్కించారు. కుటుంబ సమేతంగా చూడదిన విధంగా ఉంటుంది. సుధీర్ బాబు, నందిత నటన సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. నందిత పాత్ర వినోదాత్మకంగా ఉంటుంది.' అన్నారు.

     'Krishnamma Kalipindhi Iddarini' dedicated to Ramanaidu

    ఇటీవల విడుదలైన పాటలకు చక్కని స్పందన వస్తోంది. ఈ నెల 12న ప్లాటినం డిస్క్ వేడుకను ఘనంగా జరపబోతున్నాం. ఉగాది కానుకగా ఈ నెల మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను ఎన్నో అద్భుతమైన ప్రేమకథా చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన మూవీ మొగల్ స్వర్గీయ డా.డి.రామానాయుడు గారికి అంకితమిస్తున్నాం' అని అన్నారు.

    English summary
    The post production work of Sudheer Babu and Nanditha's romantic entertainer 'Krishnamma Kalipindhi Iddarini' is in full swing at present. Chandru, who directed the Kannada version, has also directed the film in Telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X