సుధీర్ బాబు కొత్త చిత్రం, హాట్ లుక్‌తో ప్రగతి ఆంటీ (ఫోటోలు)
హైదరాబాద్: "ప్రేమకథా చిత్రమ్" సినిమాతో హిట్ పెయిర్ అనిపించుకున్న సుధీర్ బాబు ( మహేష్ బాబు బావ ) నందిత జంటగా నటిస్తున్న కన్నడ రీమేక్ సినిమాకు "కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ" టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. కన్నడ హిట్ మూవీ "చార్మినార్" ఆధారంగా నిర్మించే సినిమా ఇది.
ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ నిర్మించే ఈ చిత్రానికి కన్నడ ఫేం చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రారంభోత్సవం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి, బి.గోపాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ముహూర్తపు సన్నివేశానికి కోదండ రామిరెడ్డి క్లాప్ కొట్టగా, రాఘవేంద్రరావు కెమెరా స్విచాన్ చేసారు. ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

కోదండ రామిరెడ్డి క్లాప్...
హీరో సుధీర్ బాబు, హీరోయిన్ నందితపై చిత్రీకరిస్తున్న తొలి సన్నివేశానికి క్లాప్ కొడుతున్న కోదండ రామిరెడ్డి.

రాఘవేంద్రరావు, బి గోపాల్
ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, బి గోపాల్ ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

స్కిప్టు అందిస్తూ...
దర్శక నిర్మాలకు తమ చేతుల మీదుగా స్క్రిప్టు అందిస్తున్న రాఘవేంద్రరావు, బి గోపాల్, కోదండ రామిరెడ్డి.

సుధీర్ బాబు, నందిత
సుధీర్ బాబు, నందిత ఇంతకు ముందు ప్రేమ కథా చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ద్వారా రెండో సారి జోడీ కడుతున్నారు.

హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలు
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ చిత్ర హీరో హీరోయిన్లు సుధీర్ బాబు, నందిత, నిర్మాత లగడపాటి శ్రీధర్, దర్శకుడు చంద్రు.

ప్రగతి ఆంటీ
నటి ప్రగతి ఈ చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎరుపురంగు డ్రెస్సులో హాజరైన ఆమె బుజంపై టాటూ ఉండటం హాట్ లుక్‌ను సంతరించుకుంది.


Click it and Unblock the Notifications











