కృష్ణంరాజు-ప్రభాస్‌-రాజమౌళి సిన్మా

By Staff

కృష్ణంరాజు-ప్రభాస్‌ల కాంబినేషన్‌లో ఒక సినిమా రానున్నట్టు చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. గతంలో చిన్నికృష్ణ కృష్ణంరాజు- ప్రభాస్‌ల కోసం ఒక కథ తయారుచేసినా బడ్జెట్‌ అంచనా భారీగా ఉండడంతో కృష్ణంరాజు స్వయంగా ఆ సినిమా నిర్మించడానికి వెనుకాడారు. ఇప్పుడు రాజమౌళి కృష్ణంరాజు- ప్రభాస్‌ల కోసం ఒక పవర్‌ఫుల్‌ కథ తయారు చేస్తున్నారు. ఛత్రపతి శతదినోత్సవ వేడుకలో రాజమౌళి కృష్ణంరాజుగారు- ప్రభాస్‌ల కాంబినేషన్‌లో త్వరలో ఒక సినిమా చేస్తాను అని ప్రకటించారు. ఆ విషయం అప్పటివరకు తెలియని ప్రభాస్‌కు రాజమౌళి నోట ఆ మాట రావడంతో ఉబ్బితబ్బిబ్బు అయ్యాడు. ఈ సినిమాకు నిర్మాత ఎవరో, ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియడానికి ఇంకా కొంత సమయం పడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X