twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్విట్టర్ రివ్యూ : కృష్ణార్జున యుద్ధం.. నాని ఫెర్ఫామెన్స్ కేక.. కానీ!

    |

    Recommended Video

    Krishnarjuna Yuddham Twitter Review ట్విట్టర్ రివ్యూ నాని ఫెర్ఫామెన్స్ కేక.. కానీ!

    టాలీవుడ్ లో నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. నాని నటించి ప్రతి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాసులు కురిపిస్తోంది. తాజగా నాని కృష్ణార్జున యుద్ధం చిత్రంతో నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మెర్ల పాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. నాని ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసాడు. రుక్సార్ మీర్, అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. యూఎస్ లో ఇప్పటికే కృష్ణార్జున యుద్ధం షోలు ప్రదర్శించబడ్డాయి. ట్విటర్ లో అభిమానుల స్పందన ఎలా ఉందొ చూద్దాం..

    డీసెంట్ ఎంటర్ టైనర్

    ఫస్ట్ హాఫ్ చాలా బావుంది. సెకండ్ హాఫ్ యావరేజ్ గాఉంది. ఓవరాల్ గా కృష్ణార్జున యుద్ధం చిత్రం డీసెంట్ గా ఉంది.

    సినిమాకు అదే హైలైట్

    నాని కృష్ణ పాత్రలో అదరగొట్టాడు. చిత్తూరు స్లాంగ్ లో అతడు చెప్పే డైలాగులు చాలా బావున్నాయి కృష్ణ పాత్ర చిత్రానికి హైలైట్.

    కామెడీ ఓకె

    కృష్ణార్జున యుద్ధం చిత్రంలో కామెడీ బావుంది. సెకండ్ హాఫ్ వీక్ గా ఉండడం వలన చిత్రం యావరేజ్ అనిపిస్తోంది.

    ఎప్పటిలాగే అదరగొట్టాడు

    ఎప్పటిలాగే నాని నటనతో అదాగొట్టాడు. మూడు పాటలు, ఫస్ట్ హాఫ్ లో కామెడీ చాలా బావుంది.

    హిట్ రిపోర్ట్స్

    కృష్ణార్జున యుద్ధం చిత్రానికి హిట్ రిపోర్ట్స్ వస్తున్నాయి. మరో హిట్ సాధించిన నానికి కంగ్రాట్స్.

    దానిపైనే ఆధారపడి ఉంటుంది

    కృష్ణార్జున యుద్ధం యావరేజ్ గా ఉంది. నాని పెర్ఫామెన్స్ బావుంది. హిప్ ఆప్ సంగీతం చిత్రానికి ప్లస్ పాయింట్. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దానిపై రిజల్ట్ ఆధారపడి ఉంది.

    రొటీన్ సినిమా

    కృష్ణార్జున యుద్ధం చిత్రానికి భిన్నమైన స్పందన వస్తోంది. చిత్రం రొటీన్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉంది. సెకండ్ హాఫ్ బిలో యావరేజ్.

    రెండు పాత్రల్లో కృష్ణ మాత్రమే

    నాని కృష్ణ పాత్రలో చిత్తూరు స్లాంగ్ లో అలరించాడు. కానీ రాక్ స్టార్ పాత్రలో మెప్పించలేక పోయాడు.

    నాని ఆ పాత్రలో

    నానికి రాక్ స్టార్ పాత్ర సెట్ కాలేదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్ తప్ప మిగిలినవి బాగాలేదు.

    సెకండ్ హాఫ్ పరిస్థితి

    కృష్ణార్జున యుద్ధం చిత్రం సెకండ్ హాఫ్ అంత బలంగా లేదు.

    English summary
    Krishnarjuna Yuddham twitter review. Nani dual role film directed by Merlapaka Gandhi
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X