కృష్ణ వంశీని రామ్ చరణ్ పెండింగ్ లో పెట్టాడా లేక...
క్రియోటివ్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణ వంశీ..మహాత్మ వంటి ప్లాప్ తర్వాత పెద్ద హీరోలు ఎవరూ అతనితో సినిమా చేయటానికి ధైర్యం చేయలేదు. దాంతో అలా గ్యాప్ తో ఉండిపోయిన కృష్ణవంశీ మొత్తానికి చిరంజీవి క్యాంప్ లోకి ప్రవేశించి రామ్ చరణ్ కి కథ వినిపించి ఓకే చేయించుకున్నారు. తను చేస్తున్న మెరుపు చిత్రం తర్వాత కృష్ణ వంశీ చిత్రమే ఉంటుందన్న చరణ్ తాజాగా మాట మార్చి...మెరుపు తర్వాత ఏం చిత్రం చేయబోతున్నాననేది అనే విషయమే బయిట చాలా ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే ఏది చేస్తాననేది ఇంకా కన్ఫర్మ్ కాలేదంటూ ట్వీట్ చేసారు. ఇదిలా ఉండగా...చరణ్ తో నెక్ట్స్ సినిమా బృందావనం దర్శకుడు వంశీ పైడిపల్లి చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఈ ట్వీట్ కి ప్రాధాన్యత వచ్చింది. ఇక రామ్ చరణ్ తాజా చిత్రం ఆరెంజ్ ఫైనల్ గా ఫ్లాప్ టాక్ తో సెటిలైంది.
కృష్ణ వంశీ రామ్ చరణ్ బృందావనం వంశీ పైడిపల్లి దిల్ రాజు krishna vamsi ram charan brindavanam vamsi paidipalli dil raju


Click it and Unblock the Notifications