రవితేజతో సింధూరం,ఖడ్గం చిత్రాలు రూపొందించన కృష్ణవంశి మరో చిత్రానికి శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. ఆ చిత్రానికి ఫైట్ అనే టైటిల్ ని పరిశీలుస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందిస్తూ సామాజంలోని కొన్ని దురాచారాలపై హీరో చేసే ఫైట్ లా స్క్రిప్టు వండుతున్నట్లు తెలుస్తోంది. ఇక కృష్ణవంశి ప్రస్తుతం శ్రీకాంత్ హీరోగా మహాత్మ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. శ్రీకాంత్ వందవ చిత్రం కావటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ బడ్జెట్ తో షూట్ చేస్తున్నారు. ఇక రవితేజ హీరోగా సురేంద్రరెడ్డి డైరక్షన్ లో రానున్న కిక్ చిత్రం దాదాపు పూర్తయినట్లే. దాంతో యువత దర్శకుడు పరుసరామ్ డైరక్షన్ ఆంజనేయులు చిత్రం బిజీలో ఉన్నారు రవితేజ. వీటి అనంతంరం ఈ ఫైట్ మొదలవుతుందని సమాచారం.