ఖడ్గం తర్వతా కృష్ణవంశీ, శ్రీకాంత్ ల సినిమా లేదు. అయితే శ్రీకాంత్ తన వందవ చిత్రాన్ని కృష్ణవంశీనే డైరక్ట్ చేయాలని కోరారు. అందుకు సమ్మతించిన కృష్ణవంశి యాసిడ్ దాడుల నేపధ్యంలో ఓ కథను తయారు చేయటానికి ఉపక్రమించారు. ఇక ఈ కాంబినేషన్ చిత్రం వచ్చే నెల 7వ తేదీ నుంచి చిత్రీకరణ మొదలవుతుందని సమాచారం. ప్రస్తుతం పరుచూరి బ్రదర్స్‌తో కృష్ణవంశీ కథాచర్చలు సాగిస్తున్నారు. బెంగుళూరు కి చెందిన నిర్మాత ఒకరు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని సమాచారం. ఛార్మి అందులో ఒకటయ్యే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు అంటున్నాయి.