రవితేజతో కృష్ణవంశీ చిత్రం
గులాబీ, నిన్నే పెళ్లాడుతా చిత్రాల తర్వాత దర్శకుడు కృష్ణవంశీ నక్సలైట్ల ఇతివృత్తంతో డేరింగ్‌గా సొంత పతాకంపై నిర్మించిన చిత్రం సింధూరం. ఆ చిత్రం ఆశించిన విజయం నమోదు చేయకపోయినా తెలుగు తెరకు ఒక రవితేజాన్ని మాత్రం అందించిన ఖ్యాతి దక్కించుకుంది. ఆ తర్వాత వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఖడ్గం చిత్రంలో రవితేజతో పాటు శ్రీకాంత్, బ్రహ్మాజీ తదితరులు కూడా ముఖ్యపాత్రలు పోషించారు. ఈసారి రవితేజ సోలో హీరోగా ఒక చిత్రాన్ని రూపొందించేందుకు కృష్ణవంశీ సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. కృష్ణవంశీ రెగ్యులర్ ప్రొడ్యూసర్ సుంకర మధుమురళి నిర్మించే ఈ చిత్రానికి సంబంధించి కథా చర్చలు కూడా ఒక కొలిక్కి వచ్చినట్టు సమాచారం.
ప్రస్తుతం రవితేజ, అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు. దాని తర్వాత వెంటనే ఆయన కృష్ణవంశీ చిత్రంలోనే నటిస్తారు. మరోవంక కృష్ణవంశీ కూడా ఎన్టీఆర్ హీరోగా రాఖీ చిత్రం రూపొందిస్తున్నారు. నవంబర్ రెండు, మూడు వారాల్లో రాఖీ విడుదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications