అంత టార్చరా?: కృష్ణవంశీ వాళ్లకు నిజంగానే 'నక్షత్రాలు' చూపించాడట!

ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లతో నక్షత్రం మూవీకి కంపోజింగ్ చేయించడంపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి.

క్రియేటివిటీ అన్న పదానికి కృష్ణవంశీ ఎలా కేరాఫ్‌గా మారిపోయారో.. ఎదుటి వ్యక్తిని కిక్కురుమనకుండా చేయడంలోను అంతే పేరు గడించారు. అందుకే ఇప్పటికీ కృష్ణవంశీతో మాట్లాడాలంటే చాలామంది హీరోలు సైతం జంకుతారనేది ఓపెన్ సీక్రెట్.

హీరోల సంగతే ఇలా ఉంటే ఇక మిగతా టెక్నీషియన్స్ పరిస్థితి ఎలా ఉండాలి. సరే, ఎవరి సంగతెలా ఉన్నా.. నక్షత్రం సినిమా మ్యూజిక్ డైరెక్టర్లకు మాత్రం కృష్ణవంశీ చుక్కలు చూపించారనే ప్రచారం ప్రస్తుతం ఫిలింనగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లతో నక్షత్రం మూవీకి కంపోజింగ్ చేయించడంపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి.

krishnavamsi Torture For A Dozen Music Directors?

కాగా, నక్షత్రం సినిమాలో మూడు పాటలకు భీమ్స్ మ్యూజిక్ అందించగా.. మరో రెండు పాటలకు భరత్ మధుసూదన్, ఒక పాటకు హరి గౌర బాణీలు అందించారు. దీనికి ముందు మరో 10మంది మ్యూజిక్ డైరెక్టర్లను పరీక్షించి గానీ వీళ్లను ఫైనల్ చేయలేదట కృష్ణవంశీ. దీంతో 'నక్షత్రం' సినిమాకు నిజంగానే మ్యూజిక్ డైరెక్టర్లకు నక్షత్రాలు కనపడ్డాయని జోకులు పేలుస్తున్నారు.

కృష్ణవంశీ అభిరుచిని పట్టుకోవడంలో సదరు మ్యూజిక్ డైరెక్టర్లు విఫలమైనందువల్లే ఇలా జరిగి ఉండవచ్చునని కొంతమంది అభిప్రాయపడుతుండగా.. మరికొందరు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. కృష్ణవంశీ ఏం చెబుతున్నారో.. ఆయనకే గుర్తుండదు. ఏ పాట ఏ థీమ్ మీద అనేది ఆయనే మరిచిపోతారు. ఆలోచనలు స్థిరంగా లేని వ్యక్తిని ఎంతని సాటిస్ఫై చేయగలం? అంటూ నిట్టూరుస్తున్నారు. ఇదన్న మాట సంగతి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X