హెచ్‌ఆర్‌సిని ఆశ్రయించిన కృష్ణుడు
చిన్న చిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు కృష్ణుడు. తాజాగా ఈ యాక్టర్ కబ్జా దారుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. మణికొండలో తన స్థలాన్నిసాయిరెడ్డి, ఎల్లారెడ్డి కబ్జా చేశారని తన పిటీషన్లో పేర్కొన్నాడు. తాను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో ఈ స్థలం కొనుకున్నానని ఆయన తెలిపారు. దీనిపై స్పందించిన హెచ్‌ఆర్‍సి ఈ నెల 21లోపు వాస్తవాలను తెలుపాలని సైబరాబాద్ పోలీసులను ఆదేశించింది.
గతంలో కృష్ణుడు ఈ విషయం గురించి మాట్లాడుతూ... మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక రెడ్డి పేరు చెప్పి తమను కొంతమంది తనను బెదరిస్తున్నారని, వారి వెనక కార్తీకరెడ్డి ఉన్నాడని తాను చెప్పడం లేదు కానీ...ఆయన పేరు చెప్పుకుని కొంత మంది స్థానిక నేతలు తనను బెదిరిస్తున్నారని మాత్రమే తాను చెబుతున్నానని, ఈ విషయం హోమంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా తనకు న్యాయం జరిగే పరిస్థితి కనిపించడం లేదని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఈ యాక్టర్ 'నా స్టైల్ నాదే' అనే చిత్రంలో నటిస్తున్నాడు. కళా ప్రొడక్షన్స్ పతాకంపై సురేందర్ కపూర్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. ఈచిత్రంలో కృష్ణుడు రౌడీ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన చేసే రౌడీయిజం మంచి కోసమా? చెడు కోసమా? అనేది సినిమాలో ఆసక్తి కర అంశం.


Click it and Unblock the Notifications











