మాకు ఫ్యామిలీ ఉంది.. అంత దారుణంగానా.. 139 రేప్ ఆరోపణలపై కృష్ణుడు ఆవేదన

నటుడు, వైసీపీ నేత కృష్ణుడు తనపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణలపై మరోసారి స్పందించారు. ఇటీవల ఓ యువతి తనపై 139 మంది లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ.. అందులో నటుడు కృష్ణుడు, యాంకర్ ప్రదీప్ పేర్లను చేర్చడం మీడియాలో సెన్సేషన్‌గా మారింది. అయితే తాను చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. నటుడు కృష్ణుడు, యాంకర్ ప్రదీప్‌కు సంబంధం లేదు అంటూ యువతి యూటర్న్ తీసుకోవడం సెలబ్రిటీలకు ఊరట కలిగించింది. ఈ క్రమంలో కృష్ణుడు ఓ వీడియోను రిలీజ్ చేసి..

Recommended Video

Anchor Pradeep Machiraju Cooking Video | బెండకాయ వేపుడు వండుతున్న యాంకర్ ప్రదీప్
 నాపై, యాంకర్ ప్రదీప్‌పై

నాపై, యాంకర్ ప్రదీప్‌పై

ఇటీవల పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఓ రేప్ కేసు నమోదైంది. ఓ యువతి తనపై 139 మంది లైంగిక దాడి (రేప్)కి పాల్పడ్డారని చెబుతూ నా పేరు, యాంకర్ ప్రదీప్ పేరును కూడా చేర్చింది. అయితే ఆ వార్త వినగానే నేను తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యాను. మాపై ఇలాంటి ఆరోపణలు రావడం ఏమిటని షాక్ గురయ్యాను అని కృష్ణుడు అన్నారు.

 నన్ను మనస్తాపానికి గురిచేసింది

నన్ను మనస్తాపానికి గురిచేసింది

యువతి ఆరోపిస్తూ కేసు నమోదు చేసిన తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ మమ్మల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి కథనాలు వెలువరించడం మాకు తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. నన్ను, ప్రదీప్‌ను దారుణంగా ట్రోల్ చేస్తూ, టార్గెట్ చేశారు. నిజానిజాలు తెలియకుండా ఇలా మపై కథనాలు ప్రసారం చేయడం బాధ కలిగించింది అని కృష్ణుడు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆరోపణల ఆధారంగా చేసుకొని

ఆరోపణల ఆధారంగా చేసుకొని


బాధితురాలు, యువతి ఆరోపణలను ఆధారంగా చేసుకొని.. మాకు ఓ కుటుంబం ఉంటుందనే కనీసం ఆలోచించకుండా అవాస్తవాలను వీడియో రూపంలో ప్రసారం చేశారు. కొంతమంది మీరు అలాంటి వారు కాదని, మీపై ఆరోపణలు రావడం బాధకరమని మీడియా ప్రతినిధులు మాతో అనడం కొంత ఊరట లభించింది అని కృష్ణుడు పేర్కొన్నారు.

నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి

నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి


నాపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరుకొన్నాను. పలు టెలివిజన్ ఛానెల్స్‌లో నా స్పందన వ్యక్తం చేశాను. ఇలాంటి కష్ట సమయంలో నాకు అండగా నిలిచిన మీడియాకు, జర్నలిస్టులకు ధన్యవాదాలు. నేను వైసీపీలో ఉన్నప్పటికీ.. టీడీపీ, జనసేన నేతలు, కృష్ణ మాదిగ మాకు అండగా నిలిచారు. అందుకు వారందరికీ థ్యాంక్స్ అంటూ కృష్ణుడు వీడియోలో తెలిపారు.

బాధితులకు అండగా ఉంటామని

బాధితులకు అండగా ఉంటామని

సమాజంలో ఏ మహిళకైనా ఇలాంటి అన్యాయం జరిగితే న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలి. అందరూ బాధితులకు అండగా ఉండాలి. ఇలాంటి సంఘటనలపై కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే దిశ లాంటి సంఘటనలు పునరావృతం కాదు అని కృష్ణుడు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X