హీరో కృష్ణుడు త్వరలో గుడ్ బై అనబోతున్నాడు
వినాయకుడు ఫేమ్ కృష్ణుడు హీరోగా మరో చిత్రం ప్రారంభమవుతోంది. హిందీలో హిట్ అయిన 'దస్ వీదానియా' చిత్రం రీమేక్ గా 'చంద్రుడు' చిత్రం రూపొందుతోంది. సత్యనారాయణ ద్వారపూడి దర్శకత్వం నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉషా సినీ స్టూడియోస్ పతాకంపై రాజ్‌కుమార్ చందక, పి.యస్.చంద్ర నిర్మిస్తున్నారు. ఈ సందర్బంగా కృష్ణుడు మాట్లాడుతూ "ఆమధ్య 'దస్ వీదానియా' చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. ఆ సినిమాను చూసినవాళ్లు నా దగ్గరికొచ్చి 'అది నువ్వు చేస్తే చాలా బాగుంటుంది' అన్నారు. అనుకున్నట్టుగానే ఈ సినిమాలో నేను నటిస్తుండటం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఇదొక మంచి చిత్రంగా నిలుస్తుందన్నారు. అలాగే దర్శకుడు మాట్లాడుతూ "కృష్ణుడి శరీరభాషకు సరిపడే చిత్రమిది. నాకు దక్కిన ఓ మంచి అవకాశంగా భావిస్తున్నా. హిందీలో కంటే తెలుగులో మరింత అందంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తామన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ.."కృష్ణుడిని దృష్టిలో పెట్టుకొనే హక్కులు కొన్నాం. కుటుంబమంతా కలిసి చూసే మంచి చిత్రమిది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల హక్కులనూ మేమే తీసుకొన్నాం. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామంటున్నారు. ఇంతకీ 'దస్ వీదానియా' అంటే రష్యన్ లో గుడ్ బై అని అర్ధం. అలాగే కథ కూడా త్వరలో చనిపోతున్నానని తెలిసిన ఓ వ్యక్తి మానసిక సంగర్షణ చుట్టూ తిరుగుతుంది.


Click it and Unblock the Notifications











