అరుంధతి విజయంతో ఊపుమీదున్న కోడిరామకృష్ణ తాజాగా మరో చిత్రానికి శ్రీకారం చుట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. యమలోకంలో శీనుగాడు టైటిల్ తో రూపొందే ఈ సోషియో ఫాంటసీని కె.వి.రావు అనే నిర్మాత ప్రొడ్యూస్ చేస్తున్నారు. వినాయకుడు ఫేమ్ కృష్ణుడు హీరోగా ఈ చిత్రంలో నటిస్తున్నాడు. మార్చి నెలాఖరులో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. అన్ని పనులు త్వరగా పూర్తి చేసి ఈ వేసవికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.