హంతకులెవరు? (కులుమనాలి ప్రివ్యూ)
రచయిత నుంచి దర్శకుడుగా మారిన సతీష్ వేగేశ్న మరో కొత్త ప్రయత్న కులుమనాలి ఈ రోజు విడుదల అవుతోంది. విమలారామన్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఈ చిత్రం ఓ ధ్రిల్లర్. ఈ చిత్రంలో కృష్ణ (కృష్ణుడు) రుషి(శశాంక్) అక్షయ్ (అక్షయ్) అను (ప్రియ) వీరంతా మంచి స్నేహితులు. విహారయాత్ర కోసం హైదరాబాద్ నుంచి కులుమనాలి వెళ్తారు.
అయితే ఈ బృందంలోని వారంతా ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. వారందరినీ ఎవరు చంపుతున్నారు? ఎందుకోసం అనే విషయాలు మాత్రం అంతుపట్టవు. ఈ రహస్యం ఛేదించడానికి ప్రవళిక (విమలారామన్) రంగంలోకి దిగుతుంది. హంతకులెవరో ఆమె కనుక్కొందా? లేదా? అనేది తెరపైనే చూడాలి. ఇక ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ''ఆద్యంతం ఆసక్తికరంగా నడిచే సినిమా ఇది. ప్రతి సన్నివేశం ఉత్కంఠ రేకెత్తిస్తుంది''అన్నారు.


Click it and Unblock the Notifications











