twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కృష్ణుడు ‘రామదండు’ ఏం చేస్తోంది..చెయ్యబోతోంది

    By Srikanya
    |

    క్యారెక్టర్ ఆర్టిస్టు నుంచి కామిడీ హీరోగా మారిన కృష్ణుడు తాజాగా 'రామదండు" అనే చిత్రంలో చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో దొంగలబండి చిత్రంతో దర్శకుడుగా మారిన రచయిత వేగేశ్న సతీష్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. రీసెంట్ ఈ చిత్రం లోగో ఆవిష్కరణ జరిగింది. 'అల్లరి" నరేష్ చిత్రలోగోను, వెబ్‌ సైట్ ‌ను కృష్ణ్భగవాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను మీడియాకు తెలియచేసారు.

    ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ-'ఇందులో కృష్ణుడు సరికొత్త పాత్రలో నటిస్తున్నాడు. ఫుట్‌బాల్ కోచ్‌గా నిజమైన ప్రతిభగల క్రీడాకారులను ప్రోత్సహిస్తూ సాగే పాత్ర ఆయనది. ప్రతిభ గల వారిని ప్రోత్సహిస్తే, వారు మన దేశాన్ని గెలిపిస్తారన్నది చిత్ర ప్రధానాంశం. ఫుట్‌బాల్ నేపథ్యంలో సాగే పూర్తి వినోదాత్మక చిత్రమిది"అన్నారు.

    ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ "సతీశ్ డైరెక్ట్ చేసిన తొలి సినిమా 'దొంగ ల బండి'లో నటించా. 'రామదండు' కథ నాకు తెలుసు. ఫుల్‌బాల్ ఆట నేపథ్యంలో పిల్లలు ప్రధాన పాత్రధారులుగా చేసిన సినిమా" అని చెప్పారు. ఇది చక్కని ఇతివృత్తంతో చేసిన మంచి సినిమా అని కృష్ణుడు తెలిపారు. ఊరి ప్రెసిడెంట్‌గా మంచి పాత్ర చేశానని కృష్ణభగవాన్ చెప్పగా, మోతుబరి పాత్రను చేశానని అజయ్‌ఘోష్ తెలిపారు.

    ఎమ్మెస్ నారాయణ, కొండవలస, మాస్టర్ భరత్, పృథ్వీ, అజయ్‌ఘోష్, శ్రీరామ్, సౌమ్య, కళ్యాణి, ద్రాక్షారామం సరోజ, ఝాన్సీ, నామాల మూర్తి తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి పాటలు: వనమాలి, అభినయ శ్రీనివాస్, ఎడిటింగ్: బస్వా పైడిరెడ్డి, డాన్స్: స్వర్ణ, ఆర్ట్: జంగారెడ్డి, కెమెరా: శరత్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సతీష్‌వేగేశ్న.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X