twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిక్స్ ప్యాక్ కథాశంతో కృష్ణుడు...‘మిస్టర్ మన్మథ’

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : కృష్ణుడు, సోనియా హీరో హీరోయిన్లుగా 'మిస్టర్ మన్మథ' చిత్రం మొదలైంది. సత్యం బెల్లంకొండ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని మల్లెల సీతారామరాజు, గుండ్లకుంట శ్రీరాములు హరిత ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.

    తాజాగా బుధవారం ఈచిత్రం ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోలో జరిగింది. సి కళ్యాణ్ పూజ ప్రారంభించగా, ప్రసన్న కుమార్ స్ర్కిప్టు ప్రతులు దర్శకుడికి అందించారు. ముహూర్తపు సన్నివేశానికి పోకూరి బాబురావు క్లాప్ ఇవ్వగా, ఎంఎల్ కుమార్ చౌదరి కెమెరా స్విచ్చాన్ చేయగా, స్రవతి రవి కిషోర్ గౌరవ దర్శకత్వం వహించారు.

    ఈ సినిమా గురించి దర్శకుడు తెలియజేస్తూ...ప్రస్తుతం అమ్మాయిల తీరు మారింది. అందరూ సిక్స్ ప్యాక్ కావాలని కోరుకుంటున్నారు. సిక్స్ ప్యాక్ అంటే 6 కోట్ల స్థిరాస్థి, 5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, త్రిబుల్ బెడ్ రూం ఫ్లాట్, కార్ వగైనా..., అలాంటి అమ్మాయికి ఎలాంటి అబ్బాయి దొరికాడు అనే కాన్సెప్టుతో ఈచిత్రాన్ని తెరకెక్కించబోతున్నామన్నారు.

    ఈ చిత్రంలో ఇంకా కొండవలస, శివన్నారాయణ, అల్లరి సుభాషిణి, మెల్కోటే, స్వప్నిక, నండూరి రాము తదితరులు నటిస్తున్నారు. కెమెరా : ఆరిఫ్ లలానీ, సంగీతం : నవనీత్ చారి, కథ : బెల్లంకొండ సత్యం, ఎస్.ఎ.కె.భాషాశ్రీ, ఎడిటింగ్ : నాగిరెడ్డి, మాటలు-పాటలు : బాషా శ్రీ, కళ : రామ్ చందర్ సింగ్, సహ నిర్మాతలు : బాలాజీ శ్రీను, కొర్రపాటి వెంకటరమణ, కథనం, దర్శకత్వం : సత్యం బెల్లంకొండ.

    English summary
    Krishnudu, Sonia starrer Mr. Manmadha movie Launched at Ramanaidu studio on wednesday. Suresh Bellamkonda is director and Haritha Entertainments produce this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X