కృష్ణుడు రౌడీయిజం...
కృష్ణుడు ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'నా స్టైల్ నాదే'. కళా ప్రొడక్షన్స్ పతాకంపై సురేందర్ కపూర్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేశారు.
'ఈచిత్రంలో కృష్ణుడు రౌడీ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన చేసే రౌడీయిజం మంచి కోసమా? చెడు కోసమా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కృష్ణుడుతో పాటు చిత్రంలోని ప్రతి పాత్ర ఎంతో వైవిద్యంగా ఉంటుంది. ఇటీవల రాజస్థాన్‌లో చిత్రీకరించిన పాటతో షూటింగ్ పూర్తయింది. త్వరలోనే పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.
రితీష్ పటేల్, నీలమ్ శెట్టి, అర్జున్ యాదవ్, మున్నా భాయ్, తెలంగాణ శకుంతల, నర్సింగ్ యాదవ్, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : సునీల్ కశ్యప్, కెమెరా : నాగేంద్ర కుమార్, సహ నిర్మాతలు, భరత్ వ్యాస్, మేఘా రాజ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : రవి కూపూర్, కథ- స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సురేంద్ర కపూర్.


Click it and Unblock the Notifications












