కృష్ణుడు లవ్ స్టోరీ (నాకూ ఓ లవరుంది ప్రివ్యూ)
వినాయకుడు చిత్రంతో హీరోగా పరిచయమైన కృష్ణుడు మరో కామిడీ చిత్రం నాకూ ఓ లవరుంది. కె.రామ్‌వెంకి అనే నూతన దర్శకుడుని పరచయం చేస్తూ రూపొందిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అవుతోంది. చిత్రం కథ ప్రకారం సంప్రదాయానికి ప్రాణమిచ్చే ఓంకార శాస్త్రి (ఎమ్మెస్) తనయుడు కృష్ణశాస్త్రి (కృష్ణుడు). తండ్రి భావాలకు కొడుకు పూర్తిగా విరుద్ధం. ప్రేమించే వయసులో పూజలూ, పునస్కారాలూ ఎందుకనేది అతని ఉద్దేశం. నీలిమ (రితిక) పరిచయంతో కృష్ణశాస్త్రిలోని యువరక్తం ప్రేమ కోరుకొంటుంది. మరి ప్రేమించాడా? ప్రేమిస్తే తండ్రిని ఎలా ఒప్పించాడు? ఈ అంశాల చుట్టూ అల్లుకొన్న కథ ఇది.ఈ చిత్రం గురించి దర్సకుడు మాట్లాడుతూ... ''సరదాగా సాగిపోయే చిత్రమిది. కృష్ణుడి నటన ఆకట్టుకొంటుంది. కె.ఎం.రాధాకృష్ణన్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణ'' అన్నారు.ఈ సందర్భంగా నిర్మాత కె. సురేష్ బాబు మాట్లాడుతూ - తాము అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయిందని, ఇటీవల బ్యాంకాక్, పటాయలలో హీరో కృష్ణుడు, హీరోయిన్ రితికలపై నాలుగు పాటలు చిత్రీకరించామని, ఇప్పటి వరకు ఎవరూ చేయని పలు అందమైన, రిచ్ లోకేషన్స్‌లో ఈ పాటల్ని చిత్రీకరించామని, కెఎం రాధాకృష్ణన్ చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారని అన్నారు.
నాకూ ఓ లవరుంది
సంస్థ: శ్రీ శివపార్వతి కంబైన్స్
నటీనటులు: కృష్ణుడు, రితిక, ఎమ్మెస్ నారాయణ, అలీ, మాస్టర్ భరత్, ఉషశ్రీ, ఖడ్గం పృథ్వీ, వేణు, అనంత్, ధన్‌రాజ్ తదితరులు.
నిర్మాత: కె.సురేష్‌బాబు
కథ, మాటలు: రాఘవ.టి
పాటలు: లక్ష్మీభూపాల్, పెద్దాడమూర్తి
సంగీతం: కె.ఎమ్.రాధాకృష్ణన్
కెమెరా: ఎస్.డి.జాన్
దర్శకుడు: కె.రామ్‌వెంకి
విడుదల: శుక్రవారం.


Click it and Unblock the Notifications











