రొమాంటిక్ కామెడీ....(మిస్టర్ మన్మథ ప్రివ్యూ)
కథలో ...ఓ పెద్ద కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మదన్ (కృష్ణుడు). పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని భావిస్తాడు. అందం, అమాయకత్వం కలిగిన ఓ అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేయాలనుకొంటాడు. కానీ అంతా ఆధునిక పోకడల్ని అలవాటు చేసుకొన్న అమ్మాయిలే తారసపడుతుంటారు. ఓ కాల్ సెంటర్లో పనిచేసే యువతి పాసర్లపూడి సోనియారెడ్డి (సోనియా). ఈమె లక్ష్యం కూడా పెళ్లి చేసుకోవడమే. సిక్స్‌ప్యాక్ ఉన్న అబ్బాయి భర్తగా రావాలని కలలు కంటూ ఉంటుంది. మరి వీరిద్దరి కోరికలు తీరాయో లేదో తెరపైనే చూడాలి.
దర్శకుడు మాట్లాడుతూ ''నవతరం అభిరుచులకు అద్దం పట్టే కథ ఇది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. కృష్ణుడు, సోనియా జంట ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. సిక్స్‌ప్యాక్ అనే మాటకి ఇందులో మేం ఓ కొత్త అర్థాన్ని చెప్పాము. నాయకుడు సినిమాలో కృష్ఱుడు, సోనియా ఎంత ఆకట్టుకొన్నారో.. అంతకు రెట్టింపు పేరు తెచ్చుకొంటారు. సరదాగా సాగే ప్రేమ కథ ఇది. మన్మథుడు ఏం చేశాడో తెర మీదే చూడాలి. నవనీత్ చారి అందించిన బాణీలు వినసొంపుగా ఉన్నాయి''అన్నారు.
సంస్థ: హరిత ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు: కృష్ణుడు, సోనియా, కొండవలస, శివన్నారాయణ, అల్లరి సుభాషిణి, మెల్కొటే, వేణు, జీవా, అమిత్, దీపికాదాస్, రాజా శ్రీధర్, నండూరి రాము తదితరులు
కెమెరా : ఆరిఫ్ లలానీ,
సంగీతం : నవనీత్ చారి,
కథ : బెల్లంకొండ సత్యం, ఎస్.ఎ.కె.భాషాశ్రీ,
ఎడిటింగ్ : నాగిరెడ్డి,
మాటలు-పాటలు : బాషా శ్రీ,
కళ : రామ్ చందర్ సింగ్,
సహ నిర్మాతలు : బాలాజీ శ్రీను, కొర్రపాటి వెంకటరమణ,
నిర్మాతలు: మల్లెల సీతారామరాజు, గుండ్లకుంట శ్రీరాములు
కథనం, దర్శకత్వం : సత్యం బెల్లంకొండ
విడుదల: శుక్రవారం.


Click it and Unblock the Notifications












