కృష్ణుడు కొత్త చిత్రం ‘నగరంలో వినాయకుడు’

By Srikanya

విలేజ్ లో వినాయకుడు చిత్రం తర్వాత మళ్లీ కృష్ణుడు ఇప్పుడు 'నగరంలో వినాయకుడు'అంటూ మనముందుకు రానున్నాడు. ప్రేమ్‌చంద్ దర్శకత్వంలో ఎం.సూర్యకమల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. గతంలో వినాయకుడు, విలేజ్‌లో వినాయకుడు చిత్రాలతో మంచి పేరు గడించిన కృష్ణుడు త్వరలో 'నగరంలో వినాయకుడు'గా ప్రేక్షకుల మన్ననలు గ్యారెంటీగా అందుకుంటాడనే నమ్మకంగా ఉన్నారు నిర్మాతలు.

ఇక చిత్రం కథ విషయానికి వస్తే...భిన్నమైన మనస్తత్వాలున్న ఓ కాలనీలో ఓ యువజంట అడుగుపెడుతుంది. అక్కడ్నుంచి ఆ దంపతులు ఎదుర్కొనే చిత్రమైన సమస్యలే ఈ సినిమా అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రంలో కృష్ణుడు సరసన రమ్య ఇందులో హీరోయిన్ గా చేస్తోంది. కృష్ణభగవాన్, మోహన్, జాకీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: బి.కె.ఈశ్వర్, కెమెరా: జె.గణేశన్, ఎడిటింగ్: అనిల్ మల్నాడ్, సంగీతం: సాహిణి శ్రీనివాస్.

ఇక ఈ చిత్రం తో పాటు కృష్ణుడు మరో చిత్రంలోనూ చేస్తున్నాడు. 'ప్రేమతో నువ్వువస్తావని'టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఓ కొత్త తరహా చిత్రం అని చెప్తున్నారు. అర్చన ప్రధాన పాత్రల్లో ఈ చిత్రంలో చేస్తోంది . తోట కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌.వి.రావు నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

ఈ 'ప్రేమతో నువ్వువస్తావని'చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ''పోలీస్‌ వ్యవస్థలో అవినీతి ఇతివృత్తంగా అల్లుకున్న కథ ఇది. అవినీతిపరులపై ఓ యువతి సాగించిన పోరాటాన్ని ఇందులో చూపిస్తున్నాం. అర్చన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దుతున్నా''మని చెప్పారు. సలీమ్‌పండా, జయప్రకాష్‌రెడ్డి, చంద్రమోహన్‌, సుమన్‌శెట్టి, జ్యోతి తదితరులు నటిస్తున్నారు. సంగీతం: అర్జున్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X