జీవితమే ఓ వైకుంఠపాళి (కృష్ణుడు 'వైకుంఠపాళి'ప్రివ్యూ)
వినాయకుడు చిత్రంతో హీరోగా పరిచయమైన కృష్ణుడు ప్రధాన పాత్రలో రూపొందిన మరో వినోదాత్మక చిత్రం వైకుంఠపాళి ఈ రోజు విడుదల అవుతోంది. చిత్రంలో చందుగా కృష్ణుడు కనిపిస్తాడు. కథ ప్రకారం చందు (కృష్ణుడు), క్రాంతి (అజయ్), మైఖేల్ (రణధీర్)... ఈ ముగ్గురూ ఒకే కళాశాలలో చదువుకున్న మిత్రులు. కాలేజీలో సరదాగా గడిపేసి అసలు జీవితంలోకి అడుగుపెడతారు. అప్పుడు అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ముగ్గురు మిత్రులు బద్ధ శత్రువులవుతారు. వీళ్ల మధ్యలోకి స్నిగ్ధ (తషు కౌశిక్) ప్రవేశిస్తుంది. ఆ తరవాత ఏం జరిగిందనేది అసలు కథ. దర్శకుడు మాట్లాడుతూ ...స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి ఆయువు పట్టులాంటిది. అజయ్ నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.ముగింపులో కృష్ణుణ్ని ఇప్పటి వరకూ చూడని కోణంలో చూస్తారు. పాటలకు మంచి స్పందన లభిస్తోందన్నారు.
సంస్థ: హరేరామ హరేకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు: కృష్ణుడు, అజయ్, రణధీర్, తషుకౌశిక్, పోసాని కృష్ణమురళి, సత్యకృష్ణన్, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, హర్షవర్థన్, సన తదితరులు
నిర్మాతలు: భువనేశ్వర మారం, సత్యదీప్‌రెడ్డి పందెమ్
దర్శకత్వం: అనిల్ గోపిరెడ్డి


Click it and Unblock the Notifications











