కృష్ణుడు ‘వైకుంఠపాళి’ఆడే రోజు ఎప్పుడు అంటే...
కృష్ణుడు, అజయ్, రణధీర్ ప్రధాన పాత్రధారులుగా హరేరామ హరేకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ గోపీరెడ్డి దర్శకత్వంలో భువనేశ్వర్ మారం, సత్యజిత్‌రెడ్డి పందెం నిర్మించిన చిత్రం 'వైకుంఠపాళి". ప్రస్తుతం ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో చిత్ర దర్శకుడు అనిల్‌గోపీరెడ్డి మాట్లాడుతూ..'ముగ్గురు హీరోలతో నిర్మాణమైన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. తషు కౌశిక్ నటన ఈ చిత్రానికి ప్లస్ పాయింట్. ఈ చిత్రం ప్రివ్యూ చూశాక మాకు చిత్రం విజయం సాధిస్తుందన్న నమ్మకం కుదిరింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 27న చిత్రాన్ని విడుదల చేస్తున్నామ"ని వివరించారు. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, సన, హర్షవర్ధన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: జవహర్‌రెడ్డి, సంగీతం: అనిల్ గోపిరెడ్డి, పాటలు: రామజోగయ్యశాస్ర్తీ, అవినాష్, నిర్మాతలు: భువనేశ్వర్ మారం, సత్యజిత్‌రెడ్డి పందెం. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ గోపిరెడ్డి.


Click it and Unblock the Notifications











