పవన్ కళ్యాణ్ ని వదలని కృతి కర్భంద
తీన్ మార్ చిత్రంలో చేసిన కృతి కర్భందా మరోసారి పవన్ ప్రక్కన ఛాన్స్ కొట్టేసిందని సమాచారం. పూరి జగన్నాధ్ తాజా చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబులో ఆమె సెకండ్ హీరోయిన్ గా చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. మే 2 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే ఈ చిత్రం అక్టోబర్ 18న విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో పవన్ జర్నలిస్ట్ గా కనిపించనున్నాడు. ఇక మెయిన్ హీరోయిన్ గా తమన్నా కనిపిస్తుంది. గతంలో బంగారం సినిమాలోనూ పవన్ కళ్యాణ్ మీడియా జర్నలిస్టు పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
మేలో షూటింగ్ ప్రారంభం అయి, దసరా నాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంలో మీడియాలోని చీడ పరుగులపై సెటర్లు ఉంటాయని, విలువలు దిగజార్చి మీడియాను డబ్బు సంపాదించడానికి, అక్రమార్జనకు వాడుకుంటున్న వారిని ఎండగట్టే విధంగా డైలాగులు ఉంటాయని అంటున్నారు. అదే జరిగితే పవన్ కళ్యాణ్ తాజా సినిమా మీడియాలో సెన్షేషన్ సృష్టించడం ఖాయం. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటో గ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: శేఖర్, ఫైట్స్: విజయ్, నిర్మాత: డివివి దానయ్య, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











