Don't Miss!
- News పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ - చంద్రబాబు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకున్న పవన్ హీరోయిన్
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ చిత్రం తీన్ మార్ లో నటించిన కృతి కర్బందా మరోసారి అగ్ని ప్రమాదనం నుంచి బయిటపడింది. అయితే ఈ సారి ఆమె చేస్తున్న సినిమా షూటింగ్ లో ఈ అగ్ని ప్రమాదం జరగలేదు. ఆమె బస చేసిన హోటల్ రూమ్ లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి ఆమె తప్పించుకుంది.
ఈ విషయమై ఆమె మాట్లాడుతూ... హోటల్ చిరాంత్ లో ఎగ్జిక్యూటివ్ సూట్ నాకు ఇచ్చారు. గీజర్ తో వేన్నీళ్లు కాచుకుని స్నానం చేసి టీవి చూస్తూ నిద్రపోయా. అయితే కొంత సేపు అయ్యాక ఏదో శబ్దం అయితే లేచి చూసాను. నిప్పులు అంటున్నట్లు అనిపించాయి. అయితే కల ఏమో అని మొదట అనుకున్నాను. కానీ అదే నిజం. కొద్దిగా శబ్దం ఎక్కువగా వినపడటంతో లేచి చూస్తే గదిలోకి మెల్లిగా మంటలు వ్యాపిస్తున్నాయి.
నేను చాలా భయపడిపోయాను. వెంటనే తేరుకుని తడి టవల్ ఒంటికి చుట్టుకుని గట్టిగా కేకలు వేసాను. ఇంతలో సినిమా వారు, హోటలు వాళ్లు వచ్చి మంటలు ఆర్పారు. ఎప్పుడూ భయపడని నేను చావును ఇలా దగ్గరగా చూసాను. హోటల్ వాళ్లు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు అనిపించింది. అంటూ ఆమె వారిపై చాలా సీరియస్ అయ్యారు.
ఇంతకు ముందు కూడా తెలుగులో చేస్తున్న కరెంట్ తీగ చిత్రం షూటింగ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి మంచు మనోజ్ సాయింతో బయటపడటం జరిగింది.