కృతి కర్బందాకి కలసిరాని మెగా పవర్ స్టార్.....!?
సుమంత్ హీరోగా వచ్చిన బోణి మూవీ ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది కృతి కర్బంద.ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ మెగా కాంపౌండ్ అండదండలు పొందింది.ఈ అమ్మడు మెగా తనయుడు రాంచరణ్‌కు చాలా క్లోజ్ అట. దీంతో పవన్ నటించే “లవ్ ఆజ్ కల్" చిత్రం రీమేక్ లో ఈ “లవ్లీ" బేబ్ కి తనే ఛాన్సిప్పించాడట.మగధీర తర్వాత కాజల్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోవడం చూసి తనకూ అలాగే మెగా ఫ్యామిలీ సపోర్ట్ కావాలని కోరుకుంటోందట..అందుకోసం..మెగా కాంపౌడ్ హీరోలతో చనువుగా మెలుగుతోందట.
'బోణి" చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన కృతి కర్భందా కెరీయర్ ఆశించినంత ఆశాజనకంగా లేదు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన 'తీన్ మార్" చిత్రం తన కెరియర్ కి ప్లస్ అవుతుందని, ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత తను వరుసగా సినిమాలు చేస్తుందని భావించిందట కృతి. 'తీన్ మార్" విడుదలయ్యి టాక్ బాగున్నప్పటికీ కృతికి మాత్రం ప్రేక్షకులు మార్కులు వేయడం లేదు. పై పెచ్చు ఆమెకు మైనస్ మార్కులు పడుతున్నాయి. ఈ నేపధ్యంలో కృతి చాలా నిరాశగా ఉందట. ఆఖరికి పవన్ కళ్యాణ్ లాంటి హీరో పక్కన నటించినా తనకు బ్రేక్ రానందుకు కృతి చాలా టెన్షన్ ఫీలవుతోందని సమాచారమ్.


Click it and Unblock the Notifications











