మహేష్ '1' లో హీరోయిన్ ప్రొఫిషన్ ఇదే
హైదరాబాద్ : ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టు ఏమిటీ అంటే మహేష్ బాబు తాజా చిత్రం '1' అని కళ్లు మూసుకు చెప్పవచ్చు. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కృతి సనన్ చేస్తోంది. ఈ చిత్రంలో కృతిసనన్ ఓ టీవీలో న్యూస్ రీడర్‌గా పని చేస్తోంది. ఇందుకోసం ఆమె ఏవో వార్తలు చదువటాన్ని నిన్న షూట్ చేసారు.
మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం '1' కోసమే ఆమె ఈ అవతారమెత్తింది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మాతలు. ఫిల్మ్‌సిటీలోని ఐ.ఫ్లోర్‌లో ఈ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.
యూరప్, బ్యాంకాక్ లో షెడ్యూల్ పూర్తి చేసుకుని తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరపుతోంది. అక్కడ చిత్రంలోని కొన్ని కీలకమైన సన్నివేశాలు తీస్తాడని తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతోంది.
మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ ఈ సినిమాతో తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రను గౌతమ్ పోషిస్తున్నాడు. ఇక్కడ అందుకు సంబంధించిన సీన్లతో పాటు యాక్షన్ సీన్లు, చేజింగ్ సీన్లు చిత్రీకరించారు.
డిఫరెంట్ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు సుకుమార్....చాలా కాలం పాటు స్క్రిప్టు వర్కు చేసి వైవిధ్యమైన అంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. వినోదంతో పాటు అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రం ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్ స్టార్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. మహేష్ సరసన కృతి షానన్ నటిస్తోంది. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.


Click it and Unblock the Notifications












