వెరీ హాట్: క్రితి ససన్ ఫిల్మ్‌ఫేర్ ఫోటో షూట్ (ఫోటోస్)
హైదరాబాద్: మహేష్ బాబు మూవీ ‘1-నేనొక్కడినే' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయిన ఢిల్లీ భామ క్రితి సనన్. అందంతో పాటు అభినయం పరంగా కూడా క్రిటిక్స్ నుండి మంచి మార్కులే కొట్టేసింది. అయితే ఇటు తెలుగులో చేసిన మొదటి సినిమా ‘1-నేనొక్కడినే', అటు హిందీలో చేసిన మొదటి సినిమా ‘హీరోపంటి' బాక్సాఫీసు వద్ద పరాజయం పాలవ్వడంతో అవకాశాలు ఆశించిన స్థాయిలో రావడంలేదు. తెలుగులో ఆమె నటించిన మరో మూవీ ‘దోచేయ్' ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించింది. అందం, అభినయం పరంగా ఆమెకు మంచి మార్కులు పడ్డాయి.
ప్రస్తుతం క్రితి సనన్ తనను తాను పబ్లిసిటీ చేసుకునే ప్రయత్నంలో పడింది. అటు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్లతో పాటు ఇటు సౌత్ ఫిల్మ్ మేకర్లను ఆకర్షించేందుకు ఫోటో షూట్లకు ప్రాధాన్యమితస్తోంది. ఇందులో భాగంగా ఆమె మే నెల సంచిక ఫిల్మ్ ఫేర్ మేగజైన్ కోసం హాట్ హాట్ గా ఫోజులు ఇచ్చింది.
క్రితి సనన్ హాట్ అండ్ సెక్సీ లుక్స్‌ని ఫోటో గ్రాఫర్స్ ఫర్ ఫెక్టుగా ప్రజెంట్ చేసారు. ఇందుకోసం ఎంచుకున్న బ్యాగ్రౌండ్ థీమ్ కూడా అద్భుతంగా, ఆకట్టుకునే విధంగా ఉంది. ఆ ఫోటోలపై మీరూ ఓ లక్కేయండి.

క్రితి సానన్
ఢిల్లీలో పుట్టి పెరిగిన క్రితి సనన్ వయసు 24 సంవత్సరాలు. తండ్రి రాహుల్ సనన్ చార్టెడ్ అకౌంటెంట్, తల్లి గీతా సనన్ ఢిల్లీ యూనివర్శిటీలో అసోసియేట్ ప్రొఫెసర్.

మోడలింగ్
టీనేజీలోనే మోడలింగ్ రంగం వైపు ఆకర్షితురాలైన ఆమె ఆ దిశగా అడుగులు వేసి గుర్తింపు తెచ్చుకుంది.

సినిమా రంగంలోకి
అందరి సెలబ్రిటీల మాదిరిగానే క్రితి సనన్ కూడా మోడలింగ్ రంగం నుండి సినిమా రంగం వైపు అడుగులు వేసింది.

నేనొక్కడినే
మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘1-నేనొక్కడినే' సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది. అయితే ఈ సినిమా సరిగా ఆడలేదు.

హిందీలో..
బాలీవుడ్లో ‘హీరోపంటి' చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది. ఈ సినిమా కూడా బాక్సాపీసు వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం షారుక్ మూవీ ‘దిల్ వాలే దుల్హనియా' చిత్రంలో అవకాశం దక్కించుకుంది.

దోచేయ్
తెలుగులో ఆమె చేసిన రెండో సినిమా ‘దోచేయ్'. ఈ చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిందనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











